News September 9, 2024

HYD: కాళోజీ నారాయణరావుకు నివాళులర్పించిన స్పీకర్

image

పద్మవిభూషణ్, ప్రజాకవి, స్వర్గీయ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహా చార్యులు పాల్గొన్నారు.

Similar News

News December 27, 2025

HYD: ఆశ్చర్యం.. కంటైనర్‌లో వైన్ షాప్

image

లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారి పక్కనే కంటైనర్‌లోనే వైన్ షాప్ ప్రారంభం కావడం చర్చనీయాంశంగా మారింది. గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంజూరైన ఓ వైన్ షాప్ రెడీ కాకపోవడంతో దుకాణదారుడు రోడ్డు పక్కనే కంటైనర్ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు ప్రారంభించాడు. ప్రధాన రహదారిపై ఇలా కంటైనర్‌లో వైన్ షాప్ నడపడం చూసిన స్థానికులు, ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

News December 27, 2025

HYD: వీడియో వైరల్ చేస్తామని అమ్మాయికి బెదిరింపులు..!

image

వాట్సాప్‌లో అనుమానాస్పద లింక్స్ పంపిస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు దిగుతున్నారని అధికారులు హెచ్చరించారు. ఉప్పల్ పరిధిలో ఓ యువతికి లింక్ పంపి వీడియో కాల్ చేసిన తర్వాత వ్యక్తిగత వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. తెలియని లింక్స్, కాల్స్‌కు స్పందించవద్దని, ఓటీపీ, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు.

News December 27, 2025

గ్రేటర్ HYDలో నీటి కష్టాలు

image

HYDలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జలాల వినియోగం విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉప్పల్‌లో 7.6 మీటర్లు, అమీర్‌పేటలో 10.5, కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 18.7, దారుల్‌షిఫా 7.1, టోలిచౌకి 3.8, రాజేంద్రనగర్ 7.6, శంషాబాద్ 4.6, వికారాబాద్ 4.8 మీటర్ల లోతుకు నీటి మట్టాలు చేరుకున్నట్లు వెల్లడించారు.