News March 29, 2024
HYD: కిడ్నీలపై ఓ కన్నేసి ఉంచండి: డా.శ్రీ భూషణ్

కిడ్నీల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ఓ కన్నేసి ఉంచాలని HYD నిమ్స్ డా.శ్రీ భూషణ్ రాజు తెలిపారు. కిడ్నీల్లోని నెఫ్రాన్లు రక్తం వడపోయడంలో కీలకపాత్ర వహిస్తాయని, చిత్రం ఏంటంటే ఇవి దెబ్బతింటున్న తొలిదశలో పైకి కనిపించదన్నారు. ఇవి నెమ్మదిగా దెబ్బతింటూ వస్తాయని, కిడ్నీల సామర్థ్యం తగ్గి, తర్వాతి దశలో కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందన్నారు. తొలిదశలో గుర్తిస్తే, త్వరగా దెబ్బ తినకుండా వ్యాధి ముదరకుండా చూసుకోవచ్చన్నారు.
Similar News
News October 22, 2025
సదర్.. దద్దరిల్లనున్న నారాయణగూడ

సదర్కు హైదరాబాద్ సిద్ధమైంది. నారాయణగూడ YMCA చౌరస్తాలో ప్రత్యేకంగా 4 వేదికలు ఏర్పాటు చేశారు. చెప్పల్బజార్, కాచిగూడ, ముషీరాబాద్, ఖైరతాబాద్తో పాటు నగర నలుమూలల నుంచి యాదవులు వేలాదిగా ఇక్కడికి తరలిరానున్నారు. దేశంలోనే పేరుగాంచిన దున్నరాజులను ప్రదర్శిస్తారు. భారీ లైటింగ్, నృత్యాలు, దున్నరాజులతో యువత విన్యాసాలు సదర్ వైభవాన్ని మరింత పెంచుతాయి. అర్ధరాత్రి వరకు డప్పుల మోతతో నారాయణగూడ దద్దరిల్లనుంది.
News October 22, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ఓపిక లేదని వెళ్లిపోయారు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులకే చిరాకు వచ్చింది. నిన్న పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు టోకెన్లు ఇచ్చారు. బుధవారం తెల్లవారుజాము వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగడంతో టోకెన్లు తీసుకున్న కొందరు అర్ధరాత్రి దాటినా ఇంకా సమయం పడుతుందని తెలిసి, ఇక తమ వల్ల కాదంటూ వెనక్కి వెళ్లిపోయారు. 10 మందికిపైగా అభ్యర్థులు టోకెన్లు తీసుకొని నామినేషన్ వేయనట్లు అధికారులు గుర్తించారు.
News October 22, 2025
మంజీరా నుంచి HYDకి కొత్త పైప్ లైన్

ఆరు దశాబ్దాల కిందటి మంజీరా పైప్లైన్ల నుంచి 20 శాతం నీరు లీకేజీల ద్వారా వృథా అవుతోంది. ఈ నీటి నష్టాన్ని అరికట్టడానికి జలమండలి సిద్ధమైంది. ఈ మేరకు రూ.722 కోట్ల వ్యయంతో కొత్త పైప్లైన్ వేయడానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ ఆమోదం రాగానే పనులు ప్రారంభించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది.