News January 24, 2025

HYD: కిడ్నీ రాకెట్ కేసులో కీలక అప్టేట్

image

కిడ్నీ మార్పిడి కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలకానంద ఆసుపత్రి యజమాని డాక్టర్ సుమంత్‌తో పాటు మరొకరు అరెస్ట్ అయ్యారు. అలకనంద హాస్పటల్‌లో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ వ్యవహారం 6నెలలుగా కిడ్నీ ట్రన్స్‌ ఫ్లాంటేషన్ ఆపరేషన్స్ కొనసాగుతున్నయి. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం సుమంత్, బెంగళూరుకు చెందిన డాక్టర్ నేతృత్వంలో ముఠా ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Similar News

News February 13, 2025

HYD: 500 పాఠశాలల్లో AI బోధనకు కృషి: సీఎం

image

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 500 పాఠశాలల్లో ఏఐ బోధనకు కృషి చేస్తున్నామని, HYDతో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌దే అని పేర్కొన్నారు.

News February 13, 2025

హుస్సేన్ సాగర్ స్కైవాక్‌కు లైన్ క్లియర్

image

HYDలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కై వాక్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే HMDA ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) విధానంలో నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. హుస్సేన్ సాగర్ చరిత్రను దృష్టిలో పెట్టుకొని నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. స్కైవాక్‌తో పాటు సైకిల్ ట్రాక్‌ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు.

News February 13, 2025

HYD: ఎమ్మెల్సీకి నోటీసులు జారీ

image

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తోల్కట్ట ఫామ్ హౌస్‌లో కోడిపందేల నిర్వహణ కేసులో నోటీసులు అందజేసినట్లు అధికారుల సమాచారం. ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌లో కోడిపందాల నిర్వహణపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు.

error: Content is protected !!