News February 14, 2025

HYD: కుంభమేళా టూర్.. యువకుడి మృతి (PHOTO)

image

ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు బయలుదేరిన రంగారెడ్డి జిల్లా వాసులు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కొంగరకలాన్‌కు చెందిన వనం సంపత్ రాణా, వనం శ్రీనివాస్, చంద్రశేఖర్, రమేశ్, సాయి కారులో బయల్దేరారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ శివారులో ముందు వెళుతున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో <<15456821>>సంపత్ రాణా<<>> అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి గాయాలు అయ్యాయి. మృతుడి ఫైల్ ఫొటో పైన చూడొచ్చు.

Similar News

News October 29, 2025

$4 ట్రిలియన్ల క్లబ్‌.. యాపిల్ అరుదైన ఘనత

image

టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ $4 ట్రిలియన్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన మూడో కంపెనీగా నిలిచింది. ఇవాళ కంపెనీ షేర్లు 0.2% పెరిగి $267.87కు చేరాయి. SEPT 9న ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్ లాంచ్ చేసినప్పటి నుంచి కంపెనీ స్టాక్ 13% పెరిగింది. చైనాలో కాంపిటీషన్, US టారిఫ్స్ ప్రతికూలతలను ఎదుర్కొని లాభాలు గడించింది. యాపిల్ కంటే ముందు Nvidia, మైక్రోసాఫ్ట్ $4T కంపెనీలుగా అవతరించాయి.

News October 29, 2025

కాజ టోల్‌గేటు వద్ద భారీ వాహనాల నిలిపివేత

image

తుఫాను కారణంగా మంగళవారం అర్ధరాత్రి వర్షం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మంగళగిరి రూరల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో భారీ వర్షానికి వరదనీరు చేరిన కాజా టోల్ ప్లాజా వద్ద ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తన సిబ్బందితో కలిసి భారీ వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. అవసరం లేనిదే ప్రజలు రోడ్లపైకి రావద్దని పోలీసులు సూచించారు.

News October 29, 2025

సిరిసిల్ల: దర్గాను తొలగించాలని బీజేపీ నేతల వినతి

image

వేములవాడ ఆలయంలో అభివృద్ధి పనుల పేరుతో కోటిలింగాలను మార్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఇతర మతస్తుల నిర్మాణాలు ఉన్నప్పటికీ వాటిని తొలగించకుండా కోటిలింగాలపై చర్యలు తీసుకోవడం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ముందుగా దర్గాను తొలగించిన తర్వాతే ఏ కార్యక్రమమైన చేపట్టాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.