News August 9, 2024

HYD: కుక్కల దాడిలో మరో బాలుడి మృతి

image

జవహర్‌నగర్‌లో కుక్కల దాడికి బాలుడు మృతిచెందిన ఘటన మరువకముందే HYD శివారులో మరో ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన శివ-మాధురి దంపతుల కుమారుడు క్రియాన్ష్(4) ఇటీవల స్కూల్‌కు వెళ్లి వస్తుండగా అతడిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడికి తీవ్ర గాయాలవగా తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తాజాగా బాలుడు మృతిచెందాడు.

Similar News

News February 26, 2026

GHMC: నిధుల విభజన వేళ రూ.300 కోట్ల దోపిడీ?

image

GHMC నిధుల విభజన కసరత్తు వేళ వ్యవస్థీకృత దోపిడీపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్ డోర్ నంబరింగ్ పేరిట ప్రజల వ్యక్తిగత డేటా ప్రైవేట్ సర్వర్లకు మళ్లుతోంది. ఖైరతాబాద్, శేరిలింగంపల్లిలో బాగున్న రోడ్లనే కూల్చి వేస్తూ ‘సిండికేట్ కాంట్రాక్టర్లు’ ఏటా రూ.300 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. హరితహారం ‘గోస్ట్ ఆడిట్’ వెనుక బినామీల బాగోతంపై విజిలెన్స్ నివేదికలు సిద్ధమవుతున్నాయి.

News February 26, 2026

HYD: మెట్రో ఫేజ్-2 అలైన్‌మెంట్ వెనుక ‘రియల్’ రాజకీయం?

image

మెట్రో ఫేజ్-2 విస్తరణ ఇప్పుడు ‘రియల్’ పాలిటిక్స్‌కు కేంద్రంగా మారింది. రాయదుర్గం ఎయిర్‌పోర్ట్ లైన్‌ను కాదని, నాగోల్-ఎల్బీనగర్ వైపు మళ్లించడం వెనుక వేల ఎకరాల భూసమీకరణపై చర్చలు జోరందుకున్నాయి. పాతబస్తీలో నిర్మాణ వ్యయం 25% పెరగడం ప్రభుత్వానికి భారం కానుంది. మరోవైపు కేంద్రం నిధులపై కొర్రీలు వేయడం, L&T బాధ్యతల మార్పులో న్యాయపరమైన చిక్కులు ప్రాజెక్టును ఉత్కంఠలో పడేశాయి.

News February 26, 2026

HYD: రూ.2వేల కోట్లతో ఆవుల పంపిణీ

image

రాష్ట్రంలో పాల దిగుబడిని పెంచేందుకు పశుసంవర్థకశాఖ రూ.2వేల కోట్లతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది. HYD మినహాయించి అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు అవుతుంది. ప్రతి జిల్లాలో ఏటా 830 మంది రైతులకు 2 చొప్పున ఆవులను సబ్సిడీపై అందించనున్నారు. మూడేళ్లలో మొత్తం 79,680 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్క యూనిట్ ఖర్చు రూ.2,51,000గా అంచనా వేయగా 50% రైతు 50% సబ్సిడీ అందిస్తుంది.