News March 20, 2024
HYD: కుక్కల బెడద.. నియంత్రణ ఎక్కడ..?
HYD, RR, MDCL పరిధిలో కుక్కల బెడదతో గల్లీలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంబర్‌పేట, షేక్‌పేట, రాజేంద్రనగర్, అద్రాస్‌పల్లి, ఉప్పల్ లాంటి అనేక చోట్ల కుక్కలు వెంటపడి కరుస్తున్నాయి. ఇప్పటికీ ఎల్బీనగర్-24385, చార్మినార్-37666, ఖైరతాబాద్-8178, శేర్లింగంపల్లి-1813, కూకట్‌పల్లి-6901, సికింద్రాబాద్‌లో 18086 కుక్కలకు స్టెరిలైజేషన్ కాలేదు. ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News September 12, 2024
HYD: సెప్టెంబర్ 17..ముఖ్య అతిథులు వీరే..!
రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. HYD జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి, RR జిల్లాలో స్టేట్ చీఫ్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది.
News September 12, 2024
HYD: ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం TIME FIX
ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనంపై HYD సిటీ కమిషనరేట్ సీపీ CV ఆనంద్ వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 17వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలలోపు నిమజ్జనం చేసేందుకు ఉత్సవ కమిటీ అంగీకరించినట్లు తెలిపారు. సమయానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, అనుకున్న సమయానికి నిమజ్జనం చేయాలన్నారు. ఇందుకు తగ్గట్లు పోలీసు బందోబస్తు ఉండాలని ఆయన సిబ్బందికి సూచించారు.
News September 12, 2024
HYD: డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయండి: మంత్రి
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజేషన్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ HYDలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 2011 జనాభా లెక్కల ప్రకారం 83.04 లక్షల కుటుంబాలలో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రతి గడపకు తిరిగి వారి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ రూపంలో నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు.