News February 18, 2025
HYD: కుటుంబాన్ని వేధిస్తున్నాడని హత్య

మేడ్చల్‌లో సోమవారం <<15492387>>దారుణ హత్య<<>> జరిగిన సంగతి తెలిసిందే. స్థానికుల వివరాలు.. రాఘవేంద్రకాలనీలోని ఓ ఇంట్లో వెంకటరమణ(32)ను అతని బావమరిది అయిన మైనర్ బాలుడు గొంతు కోసి హత్య చేశాడు. మద్యానికి బానిసై కుటుంబాన్ని వేధిస్తుండటంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. హత్య చేసిన అనంతరం మృతుడి సోదరుడికి ఫోన్ చేసి చెప్పి మొబైల్ ఆఫ్ చేశాడు. ఈ ఘటనపై మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 28, 2025
వేములవాడ TO అరుణాచలం RTC స్పెషల్ ప్యాకేజ్

వేములవాడ- అరుణాచలానికి RTC ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. DEC 6న ఉదయం వేములవాడలో బస్సు బయలుదేరి 7న కాణిపాకం, కంచి, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం అదే రాత్రి అరుణాచలం చేరుకుంటుందని డిపో మేనేజర్ బోనాల శ్రీనివాస్ తెలిపారు. 8న అరుణాచల గిరిప్రదక్షిణ అనంతరం బయలుదేరి 9న జోగులాంబ దర్శనం అనంతరం బస్సు వేములవాడకు తిరిగి వస్తుందన్నారు. పెద్దలకు రూ.5,100, పిల్లలకు రూ.3,850లను టికెట్ ఛార్జీలుగా నిర్ణయించారు.
News November 28, 2025
కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్

భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆ దేశం రూ.100 నోట్లను రిలీజ్ చేయగా, వాటిపై కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలు తమవే అన్నట్లు మ్యాప్‌ను ముద్రించింది. 2020లో అప్పటి PM కేపీ శర్మ ఓలీ మ్యాప్‌ను సవరించగా, దాన్ని ఇప్పుడు నోట్లపై ప్రింట్ చేశారు. ఈ చర్యను ఖండించిన భారత్.. ఆ 3 ప్రాంతాలు IND అంతర్భాగాలని పేర్కొంది. నేపాల్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని చెప్పింది.
News November 28, 2025
బతుకమ్మ కుంటపై HCకు హాజరవుతా: రంగనాథ్

TG: బతుకమ్మ కుంట వివాదంలో DEC 5వ తేదీలోపు కోర్టు ముందు హాజరు కావాలని, లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హైడ్రా రంగనాథ్‌ను HC ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘నాపై ఇప్పటికే 30కి పైగా కేసులున్నాయి. కబ్జాదారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. లీగల్‌గా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చెరువులను అభివృద్ధి చేస్తాం. బతుకమ్మ కుంటపై కోర్టుకు హాజరై అన్ని విషయాలు వివరిస్తాం’ అని చెప్పారు.


