News November 25, 2024

HYD: కుల గణనపై ఎంపీ ఈటల అభిప్రాయం ఇదే!

image

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కులగణనపై తన అభిప్రాయం వెల్లడించారు. కులాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో క్యాటగిరీలో ఉన్నాయని, ఈ నేపథ్యంలో కులగణన లెక్కలు కేంద్ర పరంగా ఉండటం కంటే, రాష్ట్రాలపరంగా తీస్తేనే సముచితంగా ఉంటుందన్నారు. HYD కొత్తపేటలో కులగణన శాస్త్రీయ అవగాహన ప్రోగ్రాంలో ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ, అంతరాలు లేని సోషలిజం బతుకు నెరవేరలేదన్నారు.

Similar News

News December 11, 2024

HYD: DEC-17 నుంచి రాష్ట్రపతి శీతాకాల విడిది

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది నేపథ్యంలో హైదరాబాద్ రానున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం సూచించారు. ఈ నెల 17 నుంచి 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బస చేయనున్నారని కలెక్టర్ తెలిపారు. దీనిపై అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో పాటు పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

News December 11, 2024

HYD: ‘రాష్ట్రాల మహాసభలను జయప్రదం చేయాలి’

image

DEC 14, 15 తేదీల్లో అనంతపురంలో జరిగే మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల మహాసభలను జయప్రదం చేయాలని సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ అహ్మద్ కోరారు. HYDలోని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ భవనంలో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించే మహాసభల్లో అందరూ పాల్గొనాలన్నారు. TPTF మాజీ రాష్ట్ర అధ్యక్షుడు B.కొండల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఉన్నారు.

News December 11, 2024

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రేపటి నుంచి జాతీయ సదస్సు

image

రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్‌ప్లాంట్ పాథాలజీ అండ్ ప్లాంట్ ఇన్నోవేటివ్ అప్రోచెస్ ఇన్‌ప్లాంట్ డిసీజ్ మేనేజ్‌మెంట్ (RAPPID)అంశంపై రేపటినుంచి 2 రోజుల పాటు రాజేంద్రనగర్‌లోని జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జాతీయ సదస్సు జరగనుంది. దీన్ని ఇండియన్ ఫైటోపాథాలాజికల్ సొసైటీ (సెంట్రల్ జోన్), దక్కన్ సొసైటీ ఆఫ్ ప్లాంట్ పాథాలజీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.