News August 18, 2024
HYD: కూకట్పల్లిలో వ్యభిచారం.. పోలీసుల రైడ్స్

స్పా ముసుగులో వ్యభిచారం, అనుమతులు లేకుండా స్పా నిర్వహిస్తున్న కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కూకట్పల్లి KPHB నాలుగో రోడ్డులో స్పార్కిల్ పేరిట స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఏహెచ్టీయూ బృందం శనివారం కేంద్రంపై దాడి చేసింది. ఐదుగురు మహిళలు, టెలికాలర్, మేనేజర్, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని KPHB పోలీసులకు అప్పగించారు.
Similar News
News October 28, 2025
HYD మెట్రో కోసం మూతబడ్డ మున్షీనాన్

మున్షీనాన్.. పాతబస్తీలో ఈ పేరు తెలియని వారు ఉండరు. 174 ఏళ్లుగా నడిచిన నాన్ షాపును HYD మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఇటీవల తొలగించారు. నిజాం వద్ద క్లర్క్గా పనిచేసే మున్షీ ఢిల్లీ వీధుల్లో నిప్పుల కొలిమితో చేసిన చతురస్త్ర ఆకారపు రొట్టెకు ఫిదా అయ్యారు. అచ్చం అలానే చార్మినార్లో 1851లో మున్షీనాన్ ఏర్పాటు చేశారు. జనాదరణతో మున్షీనాన్ నగరవ్యాప్తమైంది. 2025 మెట్రో పనుల్లో భాగంగా ఈ దుకాణం కనుమరుగైంది.
News October 28, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక BRSకు ఫైనల్ పరీక్ష

BRS నేతలు మహిళల కన్నీళ్లను కూడా రాజకీయం కోసం వాడుకోవడం దుర్మార్గమని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ ఛైర్పర్సన్ బండ్రు శోభారాణి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కాల్వ సుజాత అన్నారు. గాంధీభవన్లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో మహిళలను గౌరవించే సంప్రదాయం లేదని, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక BRSకు ఫైనల్ పరీక్ష అని పేర్కొన్నారు.
News October 28, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ప్రతి 100 ఓట్లకు ఒకరికి బాధ్యత

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఒక్క ఓటు కూడా మిస్ కావొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. 100% పోలింగ్ జరిగేలా చూసి తమ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించేలా చూడాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా ప్రతీ వంద మంది ఓటర్లకు ఒకరిని ఇన్ఛార్జిగా నియమించనుంది. ఆ ఇన్ఛార్జి ఆ ఓటర్లను కలిసి తప్పనిసరిగా ఓటువేసేలా జాగ్రత్తలు తీసుకోనుంది. ఇందుకు సంబంధించి మంత్రి పొన్నం ఆధ్వర్యంలో నాయకులు చర్చలు నిర్వహించారు.


