News July 1, 2024
HYD: కూచిపూడి నాట్యంలో వైష్ణవి రంగప్రవేశం

HYD రవీంద్రభారతిలో ఆదివారం మైత్రి నాట్యాలయ స్కూల్ ఆఫ్ భరతనాట్యం అండ్ కూచిపూడి ఆధ్వర్యంలో ప్రముఖ నాట్య గురువు శిరిణికాంత్ శిష్యురాలైన వైష్ణవి కూచిపూడి నాట్యంలో రంగప్రవేశం చేసింది. ఈ సందర్భంగా జావళి, తిల్లాన, శ్రీఘననాథం, ఓంకార, తరంగం తదితర అంశాల్లో నర్తించి ఆహుతులను మైమరిపించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ హాజరై వైష్ణవిని సత్కరించి అభినందించారు.
Similar News
News October 24, 2025
ఓయూలో వాయిదా పడిన కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

ఓయూ పరిధిలో ఈ నెల 18న బీసీ బంద్ నేపథ్యంలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎమ్మెస్సీ అప్లైడ్ న్యూట్రిషన్, ఎమ్మెస్సీ స్పోర్ట్స్ న్యూట్రిషన్ నాలుగో సెమిస్టర్ పరీక్షలను తిరిగి ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రం, సమయంలలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
News October 24, 2025
HYD: సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను జప్తు చేసిన ఈడీ

సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మొత్తం ₹12.65 కోట్ల ఆస్తులను అటాచ్ చేసుకుంది. హైదరాబాద్లో ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరిట వందల మందిని సాహితీ ఇన్ఫ్రా సంస్థ మోసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. డైరెక్టర్ పూర్ణచందరరావు, కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. మొత్తం ₹126 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ విచారణలో తేలింది.
News October 24, 2025
పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ బ్యాక్లాగ్ ఫలితాల విడుదల

ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంకామ్ (ఐఎస్) తదితర కోర్సుల 2000-19 మధ్య బ్యాచ్ల విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఫలితాలు సిద్ధంగా ఉన్నాయని, విద్యార్థులు తమ మార్కు మెమోలను ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచిలోని పీజీ సెక్షన్ (రూం నంబర్.13) నుంచి తీసుకోవచ్చని సూచించారు.


