News September 16, 2024

HYD: కెనడాలో మీర్‌‌పేట్ యువకుడి మృతి

image

కెనడాలో మీర్‌‌పేట్ యువకుడు మృతిచెందాడు. మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ ఓల్డ్ బాలాజీ నగర్‌కు చెందిన ప్రణీత్ కెనడాలో నివసిస్తున్నాడు. ప్రణీత్ పుట్టినరోజు కావడంతో అన్న ప్రణయ్, స్నేహితులతో కలిసి బోట్‌లో చెరువులోకి వెళ్లారు. చెరువులో బోటింగ్ చేసి తిరిగి వస్తుండగా.. ప్రణీత్ బోట్‌లో రాకుండా ఈదుకుంటూ వచ్చాడు. దీంతో మార్గమధ్యలో నీటమునిగి మృతిచెందాడు. ప్రణీత్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 10, 2025

HYD: రేపు ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

image

ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అంత్యక్రియలను రేపు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులకు CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేసి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, HYD, RR, MDCL కలెక్టర్లకు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలిచ్చారు. ఘట్‌కేసర్‌లో జరగనున్న అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

News November 10, 2025

HYD: అందెశ్రీకి కులం, మతం లేదు..!

image

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామానికి చెందిన అందెశ్రీకి కులం, మతం లేదు. ఆయన నలుగురు పిల్లల సర్టిఫికేట్‌లో కూడా కులం ఉండదు. తన గాయాలను కవితలుగా మలిచారు. ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతమైంది. ‘జై బోలో తెలంగాణా’ అని గర్జించి పాడితే, ఉస్మానియా జనగర్జనలా మారింది. ప్రజా కవి, నంది అవార్డు గ్రహీతగా 64 ఏళ్ల అందెశ్రీ జీవితం కవిత్వం, క్షోభ, కర్మల సమ్మేళనం.

News November 10, 2025

జూబ్లీహిల్స్ పిలుస్తోంది..!

image

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం జరగనుంది. ఇక్కడి ప్రతి ఓటు ఎంతో కీలకం. నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. అయితే కాస్ట్‌లీ ఏరియా కాబట్టి అద్దె సంపాదించుకోవచ్చని కొందరు ఓటర్లు తమ సొంతిళ్లను కిరాయికి ఇచ్చి సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. కొందరు కొల్లూరులోని 2BHKలోనూ ఉంటున్నారు. వారందరినీ జూబ్లీహిల్స్ పిలుస్తోంది. ఓటేసి వెళ్లమని చెబుతోంది.