News February 2, 2025

HYD: కేంద్రం మొండిచేయి చూపింది: మహేష్ గౌడ్

image

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతుందని TPCC అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అన్నారు. ఎన్నికల జరిగే రాష్ట్రాల్లోని కేంద్ర నిధులు ఇస్తుందని, అభివృద్ధి అంటే బీజేపీ ఇష్టంగా మారిందన్నారు. ఎన్నికల గెలవాలని ఉద్దేశంతోనే నిధులు ఇచ్చారని, మోదీకి అనేకసార్లు కలిసి విన్నవించినా కనికరించలేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపించిందని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.

Similar News

News February 8, 2025

బాత్రూంలో 6 ఏళ్ల బాలికపై బస్సు డ్రైవర్ లైంగిక దాడి

image

శంషాబాద్‌లో ఇన్‌ఫాంట్ స్కూల్‌ విద్యార్థినిపై బస్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తిన విషయం తెలిసిందే. ఈ నెల 4న రంగారెడ్డి జిల్లా కాగజ్‌ఘాట్‌లోని సిరి నేచర్ రిసార్ట్‌కి పిక్నిక్‌కు వెళ్లిన 6 ఏళ్ల బాలికపై బస్‌డ్రైవర్ బాత్రూంలో లైంగికదాడి చేశాడని విద్యార్థిని తల్లి శుక్రవారం మంచాల PSలో ఫిర్యాదు చేసింది. పాప ఇంటికి వచ్చి నొప్పిగా ఉందని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News February 7, 2025

CSR సమ్మిట్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

image

ఈనెల 16న శిల్పకళావేదికలో జరిగే సౌత్​ ఇండియా CSR​ సమ్మిట్​ పోస్టర్​‌ను మంత్రి శ్రీధర్​ బాబు ఆవిష్కరించారు. సమ్మిట్‌లో వెయ్యి కార్పొరేట్​ సంస్థలు, 2వేల మంది NGO’S​, పబ్లిక్​ ఎంటర్​ ప్రైజేస్‌ల ప్రతినిదులు పాల్గొంటారని తెలిపారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి 50 కేటగిరిల్లో సేవా అవార్డులు ఇవ్వనున్నారు. సమ్మిట్ లైసెన్సీ వినీల్​ రెడ్డి, TDF​ ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్​ రెడ్డి ఉన్నారు.

News February 7, 2025

బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచకపోతే రేవంత్ చిట్టా విప్పుతా: కృష్ణయ్య

image

బీసీలకు 42% రిజర్వేషన్లను పెంచకపోతే సీఎం రేవంత్ రెడ్డి చిట్టా విప్పుతామని రాజ్యసభ ఎంపీ ఆర్?కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకిగా మారారని కామెంట్ చేశారు. బీసీల అణచివేతకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. బీసీ జనాభాను తక్కువ చేసి చూపించి అన్ని రంగాల్లో, రిజర్వేషన్లలో అవకాశాలు రాకుండా అడ్డుకునేలా చేస్తున్నారన్నారు.

error: Content is protected !!