News November 26, 2024
HYD: ‘కేంద్రం సొంత భావాలను అమలు చేస్తుంది’
సమగ్ర కుల గణనతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని మాజీ పీసీసీ చీఫ్ హనుమంతరావు అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో మాట్లాడారు. ‘రాజ్యాంగ దినోత్సవం రోజున రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ప్రజలందరిపై ఉంది. కేవలం రాహుల్ గాంధీ కాకుండా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలి. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనగదొక్కి తమ సొంత భావాలను అమలు చేస్తుంది’ అని మండిపడ్డారు.
Similar News
News December 11, 2024
జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా క్రిస్మస్ వేడుకలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని SPR హిల్స్‌లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆద్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. మంత్రి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంత పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన సీఎన్ రెడ్డిని మంత్రి అభినందించారు.
News December 11, 2024
ఉత్తమ అసెంబ్లీ పర్సన్ అవార్డు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం: స్పీకర్
ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు మాదిరిగా ఉత్తమ అసెంబ్లీ పర్సన్ అవార్డు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. బుధవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీఐలో జరిగిన శాసన మండలి, శాసన సభ సభ్యుల ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్టీఆర్, వెంకయ్య నాయుడు, వైఎస్సార్ వంటి గొప్ప వ్యక్తులు బాగా మాట్లాడి గొప్ప పేరు తెచ్చుకున్నారని తెలిపారు.
News December 11, 2024
17న HYDకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది నేపథ్యంలో HYD రానున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కోరారు. శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు ఉంటారని వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, మల్కాజిగిరి, కీసర ఆర్డీవోలు శ్యాంప్రకాష్, సైదులు, ఎసీపీ రాములు పాల్గొన్నారు.