News October 7, 2024

HYD: కేంద్ర హోం మంత్రిని కలిసిన సీఎం

image

భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ. 11,713.49 కోట్లు స‌త్వ‌ర‌మే విడుద‌ల చేయాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఆయనను ఢిల్లీలో కలిసి వరద నష్టంపై సమగ్రమైన నివేదికను అందించి తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రానికి ఐపీఎస్‌ల కేటాయింపు వంటి పలు అంశాలపై చర్చించి, సహకరించాలని కోరారు.

Similar News

News October 14, 2025

రంగారెడ్డి జిల్లా ప్రజావాణికి 48 ఫిర్యాదులు

image

RR జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 48 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ-15, ఇతర శాఖలు-33, మొత్తం 48 దరఖాస్తులు అందాయన్నారు. అనంతరం అందించే వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

News October 12, 2025

RR: ఒక్క రోజు పిల్లల కోసం కేటాయించండి

image

పోలీయో.. బాడీలో ఏంజరుగుతుందో తెలిసేలోపే అంతా అయిపోతుంది. అంగవైఖల్యం పిల్లల జీవితాన్ని చిదిమేస్తుంది. 2 చుక్కలతో నిండు జీవితాన్ని మహమ్మారి నుంచి రక్షించండి. పనులు పక్కనబెట్టి నేడు ఉ.7గం.నుంచి పోలీయోడ్రాప్స్ వేయించండి. జిల్లాలోని అంగన్వాడీలు, ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులతో సహా 1,151 చోట్ల బూతులు ఏర్పాటుచేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 4,20,911మంది బాలలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

News October 11, 2025

సోమవారం నుంచి మళ్లీ యథావిధిగా ప్రజావాణి

image

స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించినందున రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. కావున రద్దుపరిచిన ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా సోమవారం నుంచి కొనసాగించడం జరుగుతుందని RR జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.