News January 12, 2025

HYD: కేటీఆర్‌కు మద్దతుగా 5వ తరగతి విద్యార్థి

image

కేటీఆర్‌‌కు మద్దతుగా ‘ఫైట్ హార్డ్ అంకుల్’ అంటూ ఆయన చిత్రాన్ని 5వ తరగతి విద్యార్థి మాణిక్య శ్రీయాన్ రాజ్ గీశాడు. ఫార్ములా-ఈ రేసు కేసులో మద్దతుగా వెళ్లిన శ్రీయాన్.. ఇలా కేటీఆర్‌పైన అక్రమ కేసులు పెడితే భవిష్యత్తులో HYDకు ఇంకా రేసులు రావని అన్నాడు. బాలుడు గీసిన చిత్రాన్ని కేటీఆర్ టీమ్ తాజాగా Xలో పంచుకుంది.

Similar News

News January 13, 2025

HYDలో విదేశీయులు.. అందు కోసమే..!

image

HYDలో నేటి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనున్న నేపథ్యంలో, 3 రోజులకు ముందుగానే విదేశీయులు హైదరాబాద్ చేరుకున్నట్లుగా తెలంగాణ టూరిజం శాఖ తెలిపింది. చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండ కోట లాంటి చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించిన కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశస్థులు మన సంస్కృతిని కొనియాడారు.

News January 13, 2025

మదాపూర్: శిల్పారామంలో మైమరిపించిన నృత్యం

image

సంక్రాంతి పండుగ సందర్భంగా మాదాపూర్ శిల్పారామంలో ఉత్సవాలు సందడిగా జరుగుతున్నాయి. ఆదివారం ఆంపి థియేటర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కందుల కూచిపూడి నాట్యాలయ గురువు రవి కూచిపూడి శిష్యబృందం ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది. కళాకారులు అశ్విక, ప్రియాంక సిరి, ఐశ్వర్య, చైత్ర, సురభి, ఆద్య, కీర్తి, ఇసాన్వి, శ్రావ్య, అరుణ, నిధి, శాన్వి, రిగిష్మ తదితరులు సంగీతాన్ని అనుగుణంగా వేసిన నృత్యం మైమరిపించింది.

News January 13, 2025

HYD: ఉద్యోగులు 2వ, 4వ సండే సమస్యలు చెప్పొచ్చు

image

ఉద్యోగుల సర్వీస్ అంశాల్లో ఎదురవుతున్న సమస్యలకు సత్వర పరిష్కారాన్ని చూపేందుకు ఆన్‌లైన్ విధానానికి శ్రీకారం చుట్టినట్టు ఆ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. ఈనెల 24న తొలి సమావేశానికి మంత్రి సీతక్క హాజరు కానున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలు, సర్వీస్ అంశాల పరిష్కారానికి ప్రతి నెల రెండో, నాలుగో ఆదివారాల్లో మధ్యాహ్నం 3గం.- 4గం. వరకు ఉద్యోగుల సమస్యలపై ఆన్లైన్ సమావేశం ఉండనుంది.