News December 20, 2024
HYD: కేటీఆర్ని కలిసిన ఆటో డ్రైవర్లు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను నంది నగర్ నివాసంలో ఆటో డ్రైవర్లు శుక్రవారం కలిశారు. ఇటీవల అసెంబ్లీలో తమ సమస్యలను లేవనెత్తినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో కొట్లాడాలని ఆటో డ్రైవర్లు కోరారు. తప్పకుండా ఆటో డ్రైవర్ల తరఫున అసెంబ్లీలో ప్రభుత్వంతో కోట్లాడుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
Similar News
News October 26, 2025
HMDA పునర్వ్యవస్థీకరణ..జోనింగ్ పై FOCUS

HYD మహానగర అభివృద్ధి సంస్థ HMDA పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. నగర పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు RRR వరకు విస్తరించిన పరిధిలో ఘట్కేసర్, శంషాబాద్, శంకరపల్లి 1-2, మేడ్చల్ 1-2 జోన్లను విభజించి, ప్రతి జోన్లో ప్రత్యేక అధికారులు, సాంకేతిక సిబ్బందిని నియమించే అవకాశముంది. ముఖ్యంగా జోనింగ్ పై ఫోకస్ పెట్టింది
News October 26, 2025
HYD: పొలిమేర దాటి పోయాడు.. పదిలంగా రావాలని!

ప్రాణం విలువ, బంధం విలువ తెలిపే ఫొటో ఇది. అమీర్పేట-కృష్ణానగర్ రూట్లో కనిపించిన ఈ దృశ్యం ఆలోచింపజేస్తోంది. ఓ వాహనం వెనుక అంటించిన కొటేషన్ ఇతర వాహనదారుల వేగాన్ని తగ్గించి, బాధ్యతను గుర్తుచేస్తోంది. ఓ నారీ దిగాలుగా ఇంటి వద్ద కూర్చొని బయటకి వెళ్లిన తన వాళ్ల కోసం ఎదురుచూస్తుంది. ‘పొలిమేర దాటి పోయాడు.. పదిలంగా ఇంటికి ఎప్పుడొస్తాడో’ అన్నట్లు ఉంది. ఈ కొటేషన్ అందరి గుండెను హత్తుకుంది.
News October 26, 2025
HYD: రేపు ‘లక్కీ’గా వైన్స్ దక్కేదెవరికి?

మద్యం షాపుల టెండర్లకు TG ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు లక్కీ డ్రా తీయనున్నారు. HYDలో ఈసారి 80 లిక్కర్ షాపులకు 3201 దరఖాస్తులు వచ్చాయి. సికింద్రాబాద్లో 99 షాపులకు 3022 మంది దరఖాస్తు చేశారు. జంటనగరాల నుంచి రూ.186.69 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. గ్రేటర్ పరిధిలోని 639 షాపులకు 34,958 దరఖాస్తులు రాగా.. రూ.1048.74 కోట్ల ఆదాయం రావడం విశేషం. రేపటి లక్కీ డ్రాలో అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి.


