News January 17, 2025
HYD: కేటీఆర్ వ్యాఖ్యలతో సానుభూతి పోతోంది: అద్దంకి

కేటీఆర్ వ్యాఖ్యలతో ఆయన మీదున్న సానుభూతి పోతోందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఫార్ములా ఈరేస్ కేసులో ఈడీ, ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించడం లేదన్నారు. విచారణ సంస్థల్ని ఆయన టెస్ట్ చేస్తున్నట్లు అనిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టానికి సహకరించడం కేటీఆర్ విధి అని గుర్తుచేశారు.
Similar News
News December 4, 2025
HYD: ఫ్యూచర్ సిటీకి సల్మాన్‌ఖాన్!

డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఆహ్వానించారు. ఈ సమ్మిట్‌లో మీడియా, వినోద రంగాల్లోని పెట్టుబడిదారులతో జరిగే సమావేశంలో సల్మాన్‌ఖాన్ ప్రసంగించే అవకాశం ఉంది. ఇటీవల ముంబై పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సల్మాన్‌ఖాన్‌ను కలిసిన విషయం తెలిసిందే.
News December 4, 2025
రంగారెడ్డి కలెక్టరేట్లో ఏసీబీ దాడులు

రంగారెడ్డి కలెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే, ల్యాండ్స్ రికార్డు ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏడీ సర్వేయర్ శ్రీనివాస్‌కు చెందిన గచ్చిబౌలిలోని మైత్రి హోమ్స్‌లోని ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో 3 బృందాలుగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 6 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.
News December 4, 2025
ఫ్యూచర్ సిటీ: ప్రభుత్వ ప్రాధాన్యతలివే!

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ఎగ్జిబిషన్ ఫ్లోర్ ప్లాన్ లీక్ అయింది. మ్యాప్ ప్రకారం, ఎగ్జిబిషన్ కేంద్ర బిందువు 5 మీటర్ల డోమ్ కాగా, అగ్రస్థానం భారత్ ఫ్యూచర్ సిటీకి దక్కింది. కీలకమైన డిఫెన్స్/స్పేస్ (1, 2) స్టాల్స్, MRDC పక్కన హాల్ పైభాగంలో ఉన్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలు, రాబోయే పెట్టుబడులు ఏ రంగం వైపు మొగ్గు చూపుతున్నాయో ఈ లేఅవుట్ స్పష్టం చేస్తోంది. ఇది కేవలం ప్లాన్ కాదు, తెలంగాణ టార్గెట్!


