News February 1, 2025

HYD: కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్

image

కేసీఆర్ రేవంత్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామని అన్నారు. ఇంకా ఫామ్ హౌస్‌లోనే ఉండి మాట్లాడతారా.. లేదా అసెంబ్లీకి వస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా ఎక్కడికి పోతాడో చూద్దామని అన్నారు. అసెంబ్లీకి వస్తే అప్పుడు మాట్లాడతామని అన్నారు.

Similar News

News September 19, 2025

HYD: రూ.3కోట్ల బంగారం.. అలా వదిలేశారు

image

గత నెల 22న శంషాబాద్ విమానాశ్రయంలో 2 లగేజీ బ్యాగులు అలాగే ఉండిపోయాయి. వాటిని ఎవరూ తీసుకెళ్లలేదు. సిబ్బంది పరిశీలించగా బంగారం కనిపించింది. 3379.600 గ్రాముల బరువు ఉంటుంది. దీని విలువ రూ.3.36 కోట్లుగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కడపకు చెందిన ఇద్దరు వ్యక్తలు కువైట్‌ నుంచి తెచ్చినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News September 19, 2025

HYDలో భారీ వరద.. కారు గ్లాస్‌లో నుంచి బయటకు తీశారు

image

గౌలిపురాలో నిన్న రాత్రి భారీ వర్షం కురువడంతో హనుమాన్‌నగర్‌ ఫేజ్‌- 2లో పెద్ద ఎత్తున వరదనీరు చేరుకుంది. మణికొండకు చెందిన ఓ కుటుంబం కారులో వచ్చి దిగేందుకు ప్రయత్నించారు. అయితే నీటి ఉద్ధృతికి కారు వరదనీటిలో కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు కారులోఉన్న రెండేళ్ల చిన్నారి, ముగ్గురు మహిళలను డోర్ గ్లాస్ లోంచి వారిని బయటికి తీశారు.

News September 19, 2025

HYD: 40 ప్రాంతాల్లో వరదలకు కారణం ఇదే..!

image

గ్రేటర్ వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థ జనాభాకు అవసరమైన స్థాయిలో లేకపోవడం, మరోవైపు సిల్ట్ భారీ మొత్తంలో పేరుక పోవడంతో అనేక చోట్ల నాలాలు పూడుకపోయాయి. ఇలాంటి పరిస్థితి దాదాపు 40 చోట్ల ఉన్నట్లు గుర్తించిన హైడ్రా ఎక్కడికక్కడ సిల్ట్ క్లియర్ చేయడంపై ఫోకస్ పెట్టినట్లు వివరించింది. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి చేస్తామని పేర్కొంది.