News February 1, 2025
HYD: కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్

కేసీఆర్ రేవంత్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామని అన్నారు. ఇంకా ఫామ్ హౌస్‌లోనే ఉండి మాట్లాడతారా.. లేదా అసెంబ్లీకి వస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా ఎక్కడికి పోతాడో చూద్దామని అన్నారు. అసెంబ్లీకి వస్తే అప్పుడు మాట్లాడతామని అన్నారు.
Similar News
News April 16, 2026
ఆ రోజు BIG DAY.. KCR VS రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 20న జరిగే భారీ బహిరంగ సభలు TGలో పొలిటికల్ హీట్‌ను పెంచనున్నాయి. BRS జగిత్యాల జైత్రయాత్ర సభలో KCR ప్రసంగించనున్నారు. అదే రోజు CM రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి, సభలో మాట్లాడనున్నారు. అవుట్‌డేటెడ్ నేత జీవన్ రెడ్డి కోసం BRS సభ పెట్టుకుందని కాంగ్రెస్ నేతలు అంటుండగా, ఇన్ని రోజులు పట్టించుకోని రేవంత్ రెడ్డి KCRకు భయపడి ఇప్పుడు మేడిగడ్డను చూసేందుకు వస్తున్నారని BRS నేతలు అంటున్నారు.
News April 16, 2026
HYD: బోరు బండి కార్మికుల ప్రాణాలతో చెలగాటమా!

నగరంలో యథేచ్ఛగా బోర్లు వేస్తున్నారు. వేసవిలోనూ వందల ఫీట్లు తవ్వుతున్నారు. పొట్టకూటి కోసం వచ్చి ఈ లారీపై పనిచేసే UP, బిహార్, ఒడిశా కార్మికులకు రక్షణ కరవవుతోంది. వీధుల్లో కరెంటు వైర్లు చేతులతో పట్టుకుంటున్నారు. ఇంటి, బండి యజమానులు రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవలే తుర్కయంజల్‌లో కొత్తిల్లు నిర్మిస్తుండగా కరెంటు తీగ తగిలి ఓ కార్మికడు మృతి చెందాడు. అధికారులు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
News April 16, 2026
HYD: జ్యూస్ అని యాసిడ్ తాగించిన చిన్నమ్మ

కుటుంబ విలువలను మంటగలిపే అమానుష ఘటన మేడిపల్లి PS పరిధిలో వెలుగుచూసింది. మామకు తోటికోడలి కుమారుడిపై ఆదరణ ఎక్కువన్న అసూయతో మహిళ బాలుడికి యాసిడ్ తాగించింది. బోడుప్పల్‌కు చెందిన నాగరాజు, సంధ్యలకు కార్తీక్ వాసు(4) కుమారుడున్నాడు. ఈ నెల 9న నాగరాజు సోదరుడి భార్య మంజుల, జ్యూస్ అని కార్తీక్‌కు యాసిడ్ తాగించింది. ఇంతకు ముందూ అతడిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


