News September 30, 2024

HYD: కొండెక్కిన కూరగాయల ధరలు..!

image

HYDలో కూరగాయల ధరలు కొండెక్కాయి. కేవలం 3 రోజుల్లోనే 20 % మేరకు ధరలు పెరిగినట్లు విక్రయదారులు తెలిపారు. ఉప్పల్ మార్కెట్లో టమాటా కిలో-70, వంకాయ-80
బెండకాయ-60, చిక్కుడు కాయ-60, దొండకాయ-60, పచ్చిమిర్చి-30, క్యాప్సికం-80 కాకరకాయ-60, గోరుచిక్కుడు-60, సొరకాయ ఒకటి-30-40, ఆలుగడ్డ-50-60, బీరకాయ- రూ.70-80గా ఉంది. నగరంలోని వివిధ మార్కెట్లలో రూ.10-20 వ్యత్యాసం ఉన్నట్లుగా పేర్కొన్నారు.

Similar News

News October 11, 2024

ఆయుధ పూజలో చేసిన స్పీకర్

image

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నివాసంలో ఆయుధ పూజలు నిర్వహించారు. ప్రజలకు స్పీకర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పూజలో చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ పామెన భీమ్ భరత్ ఓఎస్‌డీ వెంకటేశం, రఘుపతి రెడ్డి, నవాబ్‌పేట్ మండలం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

News October 11, 2024

HYD: అలయ్ బలయ్ కార్యక్రమానికి సీఎంకు ఆహ్వానం

image

గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి శుక్రవారం CM రేవంత్ రెడ్డిని అలయ్ బలయ్‌కు ఆహ్వానం అందించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఈనెల 13న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

News October 11, 2024

HYD: CM రేవంత్ రెడ్డి అత్యుత్సాహం తగ్గించుకోవాలి: చెన్నయ్య

image

ఎస్సీలలో ఎక్కువగా లబ్ది పొందింది మాదిగ కులస్తులేనని, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్ జి.చెన్నయ్య స్పష్టం చేశారు. బషీర్‌బాగ్ సమావేశంలో పోరాట సమితి ఛైర్మన్లు వెంకటేశ్వర్లు, బేల బాలకిషన్, గోపోజు రమేశ్, బత్తుల రాంప్రసాద్‌తో కలిసి చెన్నయ్య మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యుత్సాహం తగ్గించుకోవాలని పేర్కొన్నారు.