News July 31, 2024
HYD: కొడుకు వదిలేసినా.. కడుపుతీపి చంపుకోలేదు!
తల్లికి జబ్బు చేస్తే సేవచేయాల్సిన కుమారుడు రోడ్డుపై వదిలేసిన ఘటన మేడ్చల్ పరిధిలో జరిగింది. స్థానికంగా నివసించే అరవింద్ తన తల్లి అనారోగ్యంతో ఉంటే ఆస్పత్రికి తీసుకెళ్తానని బోయిన్‌పల్లిలో ఓ ఫుట్‌పాత్‌పై వదిలేశాడు. ఆ తల్లి స్పృహతప్పి పడిపోగా పోలీసులు గాంధీకి తరలించారు. కర్కశంగా ప్రవర్తించినా కడుపు తీపి చంపుకోలేక చనిపోయే ముందు కొడుకునే చూడాలనుకుంది. ఘటన స్థానికులను కంట తడిపెట్టించింది.
Similar News
News October 4, 2024
నాంపల్లి: ఈ నెల 13న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్
ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ఛైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లను, కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించినట్లు విజయలక్ష్మి చెప్పారు.
News October 4, 2024
HYD: నేడు హైకోర్టులో వైద్య శిబిరం
నిర్మాణ్ సంస్థ, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా ఈరోజు హైకోర్టులో మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ డా.రాకేశ్ సహాయ్ తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు.
News October 4, 2024
దసరా పండుగకు 6000 ప్రత్యేక బస్సులు
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్ళే ప్రయాణీకులకు ఇబ్బంది కలుగకుండా TGRTC 6000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని కూకట్పల్లి ఆర్టీసీ డిపో డీఎం హరి తెలిపారు. రద్దీకి అనుగుణంగా జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి ప్రాంతాల నుంచి కరీంనగర్, నిజామాబాద్, హనుమకొండ, వరంగల్, MBNR, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, కర్నూల్, అనంతపురం ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్లు డీఎం స్పష్టం చేశారు.