News April 29, 2024
HYD: కొత్తగా 14 లక్షల ఓటర్లు నమోదు

HYD, RR, MDCL జిల్లాలతో కూడిన GHMCలో ప్రస్తుతం కోటి కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. రెండేళ్లలో కొత్తగా 14 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. దాదాపు 5 లక్షల ఓటర్ల గుర్తింపు కార్డులు సవరణలు జరిగాయి. నగరంలోని నియోజకవర్గాల్లో అత్యధికంగా శేరిలింగంపల్లిలో 7.47 లక్షల మంది ఓటర్లు ఉండగా.. కుత్బుల్లాపూర్‌లో 7.12 లక్షలు, మేడ్చల్‌లో 6.58 లక్షలు, LB నగర్లో 6 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 27, 2025
CUA మహా మాస్టర్ ప్లాన్: 27 మున్సిపాలిటీలకు కొత్త చట్టాలు!

GHMCకి అనుబంధంగా ఉన్న 27 మున్సిపాలిటీల కోసం కోర్ అర్బన్ ఏరియా (CUA) మాస్టర్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే HMDA మాస్టర్ ప్లాన్ 2050, 56 గ్రామాలకు FCDA ప్లాన్లు పూర్తవగా నోటిఫికేషన్ ఈ వారమే విడుదల కానుంది. ఇక CUA ప్లాన్ కోసం, ప్రత్యేకంగా జోనల్ రెగ్యులేషన్స్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ రూల్స్‌ను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలో CMతో సమావేశమై చర్చించనున్నట్లు తెలిసింది.
News November 27, 2025
పాలకమండలి లేకపోవడం వల్లే ‘విలీనం’ ఈజీ

గ్రేటర్లో కలువనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుతం ఎటువంటి పాలక మండలి లేదు. సంవత్సరం క్రితమే పాలక మండళ్ల గడువు ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్లే పరిపాలన చేస్తున్నారు. విలీనాన్ని అడ్డుకునేందుకు గానీ, ప్రశ్నించేందుకు గానీ సభ్యులు ఎవరూ ఉండరు. అందుకే సర్కారు ఈ సమయం చూసి ఈ నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలను విలీనం చేసినపుడు కూడా అదే పరిస్థితి.
News November 27, 2025
HYD: విషాదం..11 ఏళ్లకే సూసైడ్

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన వెలుగుచూసింది. సుభాష్‌నగర్‌లో నివాసం ఉండే బాలుడు(11) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడు మృతదేహాన్ని పరిశీలించారు. సూసైడ్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చిన్న వయసులో బాలుడి కఠిన నిర్ణయం స్థానికులను కలచివేసింది.


