News April 29, 2024

HYD: కొత్తగా 14 లక్షల ఓటర్లు నమోదు

image

HYD, RR, MDCL జిల్లాలతో కూడిన GHMCలో ప్రస్తుతం కోటి కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. రెండేళ్లలో కొత్తగా 14 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. దాదాపు 5 లక్షల ఓటర్ల గుర్తింపు కార్డులు సవరణలు జరిగాయి. నగరంలోని నియోజకవర్గాల్లో అత్యధికంగా శేరిలింగంపల్లిలో 7.47 లక్షల మంది ఓటర్లు ఉండగా.. కుత్బుల్లాపూర్‌లో 7.12 లక్షలు, మేడ్చల్‌లో 6.58 లక్షలు, LB నగర్‌లో 6 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News April 15, 2026

HYD: మహిళను ఢీకొట్టిన RTC బస్సు.. భారీ పరిహారం

image

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శిరీష ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన ఘటనలో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2017 NOV 15న బంజారాహిల్స్‌లో జరిగిన ప్రమాదానికి డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించిన ట్రైబ్యునల్‌, మృతురాలి భర్త, తల్లిదండ్రులకు కలిపి రూ.34,84,176 ఇవ్వాలని స్పష్టం చేసింది. భర్త మరో వివాహం చేసుకున్నా పరిహారం పొందే హక్కు ఉంటుందని కోర్టు పేర్కొనడం ఈ కేసులో ప్రత్యేకంగా నిలిచింది.

News April 15, 2026

HYD: ఇంటర్ మెమోల్లో తప్పులా? సరిచేసుకోండిలా!

image

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇంటర్ బోర్డు విద్యార్థులకు సూచనలు చేసింది. మెమోల్లో విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీ, మార్కుల వంటి వాటిలో తప్పులు దొర్లితే వెంటనే సరిచేసుకోవాలని సూచించింది. ఈ సవరణల కోసం విద్యార్థులకు 10రోజుల గడువు ఇచ్చింది. కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించి అవసరమైన పత్రాలను ఇచ్చి సవరణలు చేసుకోవచ్చని, లేదా నేరుగా <<8096958096>>హెల్ప్ డెస్క్‌ను<<>> వాట్సాప్‌లో సంప్రదించాలని తెలిపింది.
SHARE IT

News April 15, 2026

HYD: అడిక్‌మెట్ మెట్టుబావికి పునర్జీవం

image

అడిక్‌మెట్‌లోని చారిత్రక మెట్టుబావికి పూర్వవైభవం లభించింది. దశాబ్దాలుగా చెత్తకుప్పగా మారిన ఈ బావిని అద్భుతంగా పునరుద్ధరించారు. టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగించడంతో ప్రస్తుతం స్వచ్ఛమైన నీటి ఊటలు ఉబికి వస్తున్నాయి. బన్సీలాల్‌పేట బావి తరహాలోనే దీనిని కూడా అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. భూగర్భ జలాల పెంపునకు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.