News March 7, 2025

HYD: కొత్వాల్‌గూడలో ఎకో పార్క్

image

కొత్వాల్‌గూడలో ఎకో పార్క్ 6 ఎకరాల్లో సాహస క్రీడలతో ప్రత్యేక జోన్ 6 ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి HMDA ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ORR పరిధిలోని హిమాయత్‌సాగర్ పక్కన 85 ఎకరాల్లో HMDA ఎకో పార్క్ అభివృద్ధి చేస్తోంది. దేశవిదేశాల నుంచి దాదాపు 1,500 రకాల పక్షులను సేకరించి ఇక్కడి వాతావరణానికి అలవాటు చేస్తున్నారు. ఈ అడ్వెంచర్ జోన్‌కు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Similar News

News March 26, 2025

సికింద్రాబాద్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

సికింద్రాబాద్ మహంకాళి PS పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం.. వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. స్పాట్ వద్ద సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

News March 26, 2025

మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: ఇలంబర్తి

image

వర్షాకాలంలో నగర వాసుల కష్టాలను తొలగించే విధంగా మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇటంబర్తి సంబంధిత అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫైర్ సేఫ్టీ, మాన్‌సూన్ యాక్షన్‌ప్లాన్, నాలా పూడికతీత, నాలా భద్రతా చెరువుల పునరుద్ధరణ అంశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి కమిషనర్ సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో ఎదురయ్యే పలు సమస్యలపై చర్చించారు.

News March 26, 2025

జిల్లాలో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు

image

రంగారెడ్డి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మంగళవారం మామిడిపల్లె, తొమ్మిదిరేకుల 38.8 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు కాసులాబాద్ 38.7℃, రెడ్డిపల్లె 38.6, మంగళ్‌పల్లె 38.4, మొగలిగిద్ద 38.3, కేతిరెడ్డిపల్లె, మొయినాబాద్, షాబాద్ 38.1, తుర్కయంజాల్, తొర్రూర్ 38, దండుమైలారం 37.7, హస్తినాపురం, నాగోల్ 37.5, గచ్చిబౌలి, మాదాపూర్, రాజేంద్రనగర్ 37.4, ఇబ్రహీంపట్నంలో 37℃ఉష్ణోగ్రత నమోదైంది.

error: Content is protected !!