News December 25, 2024
HYD: కొలువుదీరిన జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గం
ఇటీవల జరిగిన JCHSL ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్‌లు జూబ్లీహిల్స్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. అధ్యక్షుడిగా బ్రహ్మాండభేరి గోపరాజు, కార్యదర్శి ఎం.రవీంద్రబాబుతో పాటు మిగిలిన సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. కేటాయించని వారికి స్థలాలు సాధించడంతో పాటు, కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని వారు పేర్కొన్నారు.
Similar News
News December 27, 2024
నాంపల్లి ఎగ్జిబిషన్ 2025 విశేషాలు
జనవరి 1 నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఎగ్జిబిషన్) 46 రోజులపాటు మహానగర వాసులను అలరించనుంది. ఈ 84వ నుమాయిష్‌లో 2,200 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. అంతేకాక పలు ప్రభుత్వ శాఖల స్టాళ్ల ఏర్పాటు చేస్తున్నారు. 160 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా వేసి నాలుగు ప్రధాన గేట్ల వద్ద మెటల్ డిటెక‍్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఎంట్రీ ఫీజ్ రూ.50 (గతేడాది రూ.40)గా నిర్ణయించారు.
News December 27, 2024
HYD: మలేషియాలో తెలుగు కోర్సులు: నిత్యానందరావు
నాంపల్లిలో మలేషియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో తెలుగు భాషలో డిప్లొమా కోర్సుల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్నామని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వైస్ ఛైర్మన్ నిత్యానందరావు తెలిపారు. తెలుగు భాష ఉనికి పోతే తెలుగు జాతి ఆస్తిత్వం కోల్పోతుందన్నారు. ఇది మలేషియాలో స్థిరపడ్డ తెలుగు జాతికి ఎంతో ఉపయోగమన్నారు. మలేషియా తెలుగు సంఘం ప్రతినిధులు వెంకట ప్రతాప్, సత్తయ్య, సుధాకర్ పాల్గొన్నారు.
News December 27, 2024
HYD: స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం
ఎనిమిదో ఎడిషన్ తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఘనంగా ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు 6 విభాగాల్లో పోటీ పడుతున్నారు. తొలి రోజు ప్రతికూల వాతావరణంలోనూ హుస్సేన్‌సాగర్ జలాల్లో సెయిలర్లు రంగురంగుల బోట్లలో ప్రాక్టీస్‌తో సందడి చేశారు. ఈ ఏడాది హర్యానాకు చెందిన ఆరుగురు సెయిలర్లు ఓపెన్ విభాగంలో పాల్గొంటున్నారు.