News April 3, 2024
HYD: కోరిక తీర్చాలని బాబాయ్ వేధింపులు

HYDలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోరిక తీర్చాలని బాబాయ్ యువతిని వేధించాడు. బాధితురాలు తల్లికి చెప్పడంతో అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి లైంగికంగా వేధించగా ఆమె షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన నాగోల్ పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు పంపారు. అంతేకాకుండా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లోనే 96 మంది పోకిరీలపై చర్యలు తీసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News April 19, 2025
HYD: అగ్నివీర్ దరఖాస్తులు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యువకుల నుంచి అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 21 నుంచి మే 11 వరకు అగ్నివీర్ వాయుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ర్యాలీ ఉంటుందన్నారు. http://agnipathvayu.cdac.inలో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు సికింద్రబాద్‌లోని కమాండింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని (040-27758212) సంప్రదించవచ్చు.SHARE IT
News April 18, 2025
రాహుల్‌గాంధీతో ఏఐఓబీసీఎస్‌ఏ సమావేశం

అఖిల భారత ఓబీసీ విద్యార్థులు సంఘం జాతీయ, తెలంగాణ, HCU కమిటీ నాయకుల బృందం శుక్రవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. ఏఐఓబీసీఎస్‌ఏ జాతీయ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రతినిధులు సమావేశమయ్యారు. రిజర్వేషన్ల అమలు, విశ్వవిద్యాలయాల్లో బోధనా ఉద్యోగాల నియమకాల్లో రోస్టర్ లోపాలు తదితర అంశాలు రాహుల్ గాంధీకి వివరించినట్లు తెలిపారు.
News April 18, 2025
తార్నాక టీజీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ సేవలు

తార్నాకలోని టీజీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో గుండె సంబంధిత చికిత్సలకు క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమర్జెన్సీ కేర్ యూనిట్ ప్రారంభమైంది. ఈ సేవలను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ శుక్రవారం ప్రారంభించారు. ఫ్యాక్ట్స్ ఫౌండేషన్, అశోక్ లేలాండ్, నిర్మాన్ డాట్ ఓఆర్‌జీ సంస్థల సాయంతో ఈ విభాగాలు ఏర్పాటు అయ్యాయి. క్యాథ్ ల్యాబ్‌తో ఉద్యోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.