News February 12, 2025

HYD: కోర్ వైపు కష్టమే.. అంతా కంప్యూటర్ వైపే..!

image

HYD, RR, MDCL కాలేజీల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్ తదితర కోర్ బ్రాంచీల్లో ఇంజినీరింగ్ సీట్లు భారీగా పడిపోతున్నాయి. విద్యార్థుల ఆలోచనను పసిగట్టి, కోర్ బ్రాంచీలు తీసేసి కంప్యూటర్ కోర్సుల వైపు కాలేజీలు మొగ్గు చూపుతున్నాయి.వచ్చే ఏడాదికి తమకు AI, కంప్యూటర్ సైన్స్ (CSE)లాంటి కోర్సులు నడిపేందుకు పర్మిషన్ కావాలని సుమారు 15కు పైగా కాలేజీలు దరఖాస్తులు పెట్టుకున్నాయి.

Similar News

News October 19, 2025

కేఆర్‌పురం ITDAకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు

image

బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం ఐటీడీఏ రాష్ట్రంలోనే ఉత్తమ ఐటీడీఏగా కేంద్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె. రాములు నాయక్ OCT 17న న్యూ ఢిల్లీలో నిర్వహించిన “ఆది కర్మయోగి జాతీయ సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ధాత్రి అభ జనభాగిదారి అభియాన్‌లో చేసిన విశేష కృషికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ ఐటీడీఏ అవార్డు లభించినట్లు పీవో తెలిపారు.

News October 19, 2025

NZB: మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ

image

NZB, KMR జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. శనివారం ఉదయం నుంచే అభ్యర్థులతో ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. శనివారం నాటికి నిజామాబాద్ జిల్లా(102)లో 2,568, కామారెడ్డి జిల్లా(49)లో 1,400పైగా దరఖాస్తులు వచ్చాయి. కాగా షాపులకు దరఖాస్తుల గడువును ఈనెల 23 వరకు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్యం ఇంకా పెరగనున్నాయి.

News October 19, 2025

MHBD: లిక్కర్ షాపులకు 1,672 దరఖాస్తులు

image

మహబూబాబాద్ జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సులకు ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 61 లిక్కర్ షాపులకు గాను 1,672 దరఖాస్తులు వచ్చాయని మహబూబాబాద్ ఎక్సైజ్ SP కిరణ్ తెలిపారు. శనివారం 735 దరఖాస్తులు అందినట్లు ఆయన చెప్పారు. ఈ నెల 23 వరకు గడువు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.