News December 19, 2024
HYD: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్
సికింద్రాబాద్‌లోని వెస్లీ డిగ్రీ కళాశాల మైదానంలో 46వ యునైటెడ్ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురికి గవర్నర్ క్రిస్మస్ కానుకలను అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రార్థనలు, నృత్యం, నాటకాలతో క్రిస్మస్ వేడుకలు ఆకట్టుకున్నాయి.
Similar News
News January 14, 2025
HYD: మాంజా ప్రాణాలకు ముప్పు: డీసీపీ
HYD సీపీ ఆదేశాలతో ప్రమాదకరమైన చైనా మాంజా అమ్మకాలను అరికట్టినట్లు DCP సుదీంద్ర తెలిపారు. గాలిపటాలకు వాడే సింథటిక్ తీగ మానవ, వన్యప్రాణుల జీవితానికి ముప్పు అని తెలిపారు. దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. OCT- JAN మధ్య ఈ దారాలకు సంబంధించి 107 కేసులు నమోదు చేసి 148 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. రూ.88లక్షల బాబిన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.
News January 14, 2025
SUPER.. దేశంలోనే మొదటి పార్కింగ్ కాంప్లెక్స్ మన HYDలో..!
HYD నాంపల్లి పరిధిలో నిర్మించిన ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో నాంపల్లి పరిధిలో రోడ్డుపై పార్కింగ్ సమస్యలు తగ్గనున్నాయి. ఈ పార్కింగ్‌ను 15 అంతస్తులు మేర, జర్మన్ టెక్నాలజీతో నిర్మించారు. దేశంలో ఇదే మొట్ట మొదటి పెద్ద ఆటోమేటిక్ పార్కింగ్ కాంప్లెక్స్ కానుంది.
News January 14, 2025
HYD: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో..
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.