News July 21, 2024

HYD: క్షయకు BCG టీకాతో చెక్

image

HYD, RR, MDCL, VKB జిల్లాల పరిధిలో పెద్దలకు BCG టీకా అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్షయ వ్యాధిని అంతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులో అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మేడ్చల్ జిల్లాలో TB వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు, సర్వే నిర్వహించి, శాంపిల్స్ సేకరించి టెస్టులు చేస్తున్నారు.

Similar News

News July 9, 2025

HYD: నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కొద్దని.. హత్య

image

రామచంద్రపురంలో జరిగిన <<16980046>>హత్య కేసు<<>>లో ప్రియుడు ప్రవీణ్‌కుమారే రమ్యను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. తమ ప్రేమకు యువతి పేరెంట్స్ నో చెప్పడం, వారం రోజులుగా ఫోన్లకు యువతి స్పందించకపోవడంతో ప్రవీణ్ కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కనిది.. ఇంకెవరికీ దక్కొద్దనే ఉద్దేశంతో సోమవారం రమ్య తల్లిదండ్రులు డ్యూటీలకు వెళ్లగా ఇంట్లోకి వెళ్లిన ప్రవీణ్ గొడవ పడి కత్తితో రమ్య గొంతుకోసి హత్య చేశాడు.

News July 9, 2025

HYD: రేపు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం

image

రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించనున్నారు. 5వ బంగారు బోనాన్ని సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి సమర్పించనున్నట్లు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఛైర్మన్ రాఘవేందర్ తెలిపారు. కాగా, ఇప్పటికే గోల్కొండ జగదాంబ అమ్మవారు, విజయవాడ కనకదుర్గ, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనాన్ని సమర్పించిన విషయం తెలిసిందే.

News July 9, 2025

HYD: మహిళలు.. ఈ నంబర్‌ సేవ్ చేసుకోండి

image

మహిళలకు అండగా రాచకొండ షీ టీమ్స్ ఉంటుందని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. గత 15 రోజుల్లో 185 మంది పొకిరీలను షీ టీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 215 ఫిర్యాదుల్లో 9 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. మెట్రో, బస్టాండ్లలో షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లను నిర్వహిస్తోందని, మహిళలు వేధింపులకు గురైతే రాచకొండ వాట్సప్ నంబర్ 8712662111కు ఫిర్యాదు చేయాలన్నారు.