News July 21, 2024
HYD: క్షయకు BCG టీకాతో చెక్
HYD, RR, MDCL, VKB జిల్లాల పరిధిలో పెద్దలకు BCG టీకా అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్షయ వ్యాధిని అంతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులో అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మేడ్చల్ జిల్లాలో TB వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు, సర్వే నిర్వహించి, శాంపిల్స్ సేకరించి టెస్టులు చేస్తున్నారు.
Similar News
News October 16, 2024
సిద్దిపేట: మౌంట్ పాతల్స్ అధిరోహించిన విహాన్ రామ్
హిమాచల్ ప్రదేశ్‌లోని మౌంట్ పాతల్స్ పర్వతాన్ని (4,250mtrs)& (14,600 feets) సిద్దిపేట జిల్లా హనుమతండాకు చెందిన బాలుడు జాటోత్ విహాన్ రామ్ అధిరోహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “Say No To Drugs”అనే నినాదం పట్ల యువతకు అవగాహన కల్పించడానికి పర్వతాన్ని అధిరోహించినట్లు విహాన్ రామ్ తెలిపారు. అతి పిన్న వయస్సులో విహాన్ రామ్(8) ప్రతికూల వాతావరణంలో అధిరోహించాడు.
News October 16, 2024
సంగారెడ్డి: మంత్రి దామోదర్ నేటి పర్యటన వివరాలు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేడు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో ట్రాఫిక్ పోలీసులకు బైకులను పంపిణీ చేస్తారన్నారు. 11 గంటలకు శివంపేటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని వివరించారు.
News October 15, 2024
దుబ్బాక: భర్తకు తలకొరివి పెట్టిన భార్య
వారిద్దరూ అన్యోన్య దంపతులు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచి జీవనం సాగించారు. అయితే విధి వారి బంధాన్ని విడదీసింది. దుబ్బాక మున్సిపాలిటీ పరిధి లచ్చపేటకు చెందిన పూల శంకర్(55), రాధ భార్యాభర్తలు. సోమవారం ప్రమాదవశాత్తు శంకర్ మురికి కాలువలోపడి మృతి చెందాడు. ఆయనకు కొడుకులు లేకపోవడంతో రాధ అంతా తానై భర్తకు అంత్యక్రియలు నిర్వహించింది. తానే భర్తకు తలకొరివి పెట్టింది. ఈఘటన బంధువులను కంటతడి పెట్టించింది.