News February 4, 2025

HYD: ఖర్చులకోసం పార్ట్ టైం జాబ్.. జాగ్రత్త!

image

ఇంటి ఖర్చులకోసం పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకుంటున్నారా? జాగ్రత్తగా ఉండాలని HYD పోలీసులు సూచిస్తున్నారు. HYDలో గతేడాది జరిగిన సైబర్ క్రైమ్ కేసుల్లో 30% 5,400కుపైగా సైబర్ క్రైమ్ నేరాలు నమోదయ్యాని తెలిపారు. పార్ట్ టైం ఉద్యోగాలకు సంబంధించినవని అధికారులు ప్రత్యేక రిపోర్టులో వెల్లడించారు. కరోనా తర్వాత వర్క్ ఫ్రొం హోమ్ అవశ్యకత పెరిగింది. దీంతో ఇంట్లో ఉండే గృహనులను టార్గెట్ చేస్తున్నారు. జాగ్రత్త!

Similar News

News December 26, 2025

ప.గో: ఆడుకోమని వదిలిన తండ్రి.. విగత జీవిగా కొడుకు!

image

పార్కులో తన కొడుకుని ఆడుకోమని వదిలి వెళ్లిన కొద్దిసేపటికి చెరువులో పడి విగత జీవిగా మారిన ఘటన గురువారం పెనుగొండలో చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఆర్.కండ్రిక గ్రామానికి చెందిన జొన్నల ధనరాజు పెనుగొండలో బేకరీ నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం కుమారుడు ఈశ్వర్(5) తీసుకొని బేకరీకి వచ్చిన ధనరాజు కొద్దిసేపు పార్కులో ఆడుకోమని వదిలిపెట్టి వెళ్లాడు. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.

News December 26, 2025

మామిడిలో మంచి పూత కోసం ఏం చేయాలి?

image

మామిడి చెట్లలో అక్కడక్కడ పూత మొగ్గలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబర్, JAN నెలల్లో రైతులు తీసుకునే చర్యలు మామిడి పూతను నిర్ణయిస్తాయి. ఈ సమయంలో పంటకు తేనెమంచు పురుగు, బూడిద తెగులు ముప్పు ఎక్కువ. వాటి నియంత్రణకు జాగ్రత్తలు తీసుకుంటూనే చెట్లలో సూక్ష్మపోషకాల లోపాన్ని గుర్తించి అవసరమైన మందులను నిపుణుల సూచనలతో పిచికారీ చేయాలి. మామిడిలో మంచి పూత కోసం ఏం చేయాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 26, 2025

వరుసగా రెండో ఏడాది.. భారత క్రికెటర్లకు నిరాశ!

image

దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘ఖేల్‌రత్న’ జాబితాలో రెండేళ్లుగా క్రికెటర్లకు చోటు దక్కట్లేదు. తాజాగా గగన్ నారంగ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 24 మంది క్రీడాకారుల పేర్లను క్రీడా మంత్రిత్వశాఖకు పంపగా అందులో ఏ ఒక్క క్రికెటర్ లేరు. ఈ ఏడాది మెన్స్ క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ, ASIA కప్ గెలవగా.. ఉమెన్స్ టీమ్ తొలిసారి వన్డే WC సాధించింది. అయినా ఒక్కరిని కూడా ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.