News February 4, 2025

HYD: ఖర్చులకోసం పార్ట్ టైం జాబ్.. జాగ్రత్త!

image

ఇంటి ఖర్చులకోసం పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకుంటున్నారా? జాగ్రత్తగా ఉండాలని HYD పోలీసులు సూచిస్తున్నారు. HYDలో గతేడాది జరిగిన సైబర్ క్రైమ్ కేసుల్లో 30% 5,400కుపైగా సైబర్ క్రైమ్ నేరాలు నమోదయ్యాని తెలిపారు. పార్ట్ టైం ఉద్యోగాలకు సంబంధించినవని అధికారులు ప్రత్యేక రిపోర్టులో వెల్లడించారు. కరోనా తర్వాత వర్క్ ఫ్రొం హోమ్ అవశ్యకత పెరిగింది. దీంతో ఇంట్లో ఉండే గృహనులను టార్గెట్ చేస్తున్నారు. జాగ్రత్త!

Similar News

News February 9, 2026

VJA: దుర్గమ్మ సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

image

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉట్కూరు శ్రీనివాస్ సోమవారం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఈవో వి.కె. సీనా నాయక్ స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు న్యాయమూర్తికి ఆశీర్వచనాలు పలికారు. ఈవో సీనా నాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేసి గౌరవించారు.

News February 9, 2026

ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేయ‌డం CBN మీకే చెల్లింది: వెల్లంపల్లి

image

నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేద‌ని CBI-SIT ఛార్జిషీట్‌లో ల్యాబ్ రిపోర్టులతో నిర్ధారణ అయ్యాక కూడా ఇంకా ఎందుకు విష ప్ర‌చారం చేస్తున్నారు అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు “X” వేదికగా సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేయ‌డం మీకే చెల్లింది. నెయ్యిలో జంతు కొవ్వు క‌లిసింద‌ని, కెమిక‌ల్స్ ఉన్నాయ‌ని ఇలా సీఎం స్థానంలో ఉంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం క‌రెక్టేనా అంటూ రాసుకొచ్చారు.

News February 9, 2026

ఎన్నికలకు సిద్ధం.. సిబ్బంది ఖరారు: కలెక్టర్

image

జిల్లాలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియలో కీలకమైన చివరి విడత ర్యాండమైజేషన్ సోమవారం కలెక్టరేట్‌లో పూర్తయింది. ఎన్నికల సాధారణ పరిశీలకులు రమేష్ సమక్షంలో కలెక్టర్ చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. ​NLG కార్పొరేషన్ సహా MLG, నందికొండ, హలియా, DVK, చండూరు, చిట్యాల పురపాలక సంఘాల్లో 475 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.