News February 15, 2025
HYD: గచ్చిబౌలిలో అవినీతి అధికారి.. రూ. 100 కోట్లు!

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన గచ్చిబౌలి ADE సతీశ్ కుమార్ ఇంట్లో ACB సోదాలు ముగిశాయి. శుక్రవారం రూ.50 వేలు తీసుకుంటుండగా అధికారులకు పట్టుబడ్డాడు. సోదాలు చేపట్టిన ACB ఏకంగా రూ. 100 కోట్ల వరకు స్థిర, చర ఆస్తులు ఉన్నట్లు అంచనా వేశారు. రెండు రోజులపాటు సోదాలు జరిపి ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలు సేకరించారు. HYD, RR, కరీంనగర్‌లో స్థలాలు, భవనాలు ఉన్నట్లు గుర్తించారు. సతీశ్‌ను రిమాండ్‌కు తరలించారు.
Similar News
News March 18, 2025
భారీ లాభాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 736 పాయింట్ల లాభంతో 75,047 వద్ద ట్రేడ్ అవుతుంటే, నిఫ్టీ 255 పాయింట్ల లాభంతో 22,764 వద్ద కదలాడుతోంది. జొమాటో, ఐసీఐసీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, HUL, L&T షేర్లు లాభాల్లో ఉన్నాయి.
News March 18, 2025
సిద్దిపేట: ‘కుటుంబమే విద్యార్థుల వికాసానికి పునాది’

కుటుంబంలోని తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల ప్రభావం విద్యార్థులపై బలంగా ఉంటుందని ప్రముఖ మనో వికాస శాస్త్రవేత్త, విద్యా కౌన్సిలర్ డాక్టర్ సి. వీరేందర్ అన్నారు. సిద్దిపేటలో నిన్న జరిగిన ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఉత్తమ విద్యార్థులను తయారు చేయడానికి కుటుంబం పునాది వంటిదని అన్నారు.
News March 18, 2025
అత్యాచారం కేసులో పేరుసోమల వ్యక్తికి జీవిత ఖైదు

అత్యాచారం కేసులో నంద్యాల జిల్లా వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష పడింది. సంజామల మండలం పేరుసోమలకు చెందిన ఉప్పు నాగహరికృష్ణ 2020లో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువు కావడంతో హరికృష్ణకు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ కర్నూలు జిల్లా మహిళా కోర్టు జడ్జి వి.లక్ష్మీరాజ్యం తీర్పు చెప్పారు.