News March 30, 2025
HYD: గచ్చిబౌలి, KPHBలో RAIDS

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. 12 మంది సెక్స్వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. AHTU DCP ఆధ్వర్యంలో కూకట్పల్లి, KPHB, గచ్చిబౌలి PS పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహిళలను పట్టుకున్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ ఇచ్చి బైండ్ ఓవర్ చేశారు. సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని పోలీసులు సూచించారు.
Similar News
News November 25, 2025
సికింద్రాబాద్: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి త్వరగా వెళ్లాలంటే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలే శరణ్యం. ఇటీవల కాలంలో రైలులో కోచ్ల సంఖ్య సరిపోకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. చాలా మంది వీటి సంఖ్యను పెంచాలని అధికారులకు వినతిపత్రాలిచ్చారు. ఈ నేపథ్యంలో కోచ్ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 14 ఉన్న ఏసీ చైర్ కార్ కోచ్ల సంఖ్యను 16కు పెంచనున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
News November 25, 2025
GHMC కౌన్సిల్ హాల్లో తగ్గేదే లే!

GHMC కీలక సమావేశానికి వేదికైంది. మరో 3 నెలల్లో పాలకవర్గం ముగియనుంది. మేయర్ అధ్యక్షతన నేడు జరిగే సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, కొన్ని అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. చర్చల్లో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని ప్రతిపక్షాలు, ధీటైన సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ సభ్యులు కూడా తగ్గేదే లే అంటున్నారు.
News November 25, 2025
EXCLUSIVE: 15 ఏళ్ల తర్వాత తొలుగుతోన్న ముసుగులు

GHMCలో 15 ఏళ్లుగా ముసుగు కప్పుకున్న విగ్రహాల తెర వీడుతోంది. స్టాండింగ్ కమిటీ నుంచి ఆమోదం పొంది 5 నెలలు గడిచినా మధ్యలో పనులు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం ప్రధాన కార్యాలయంలోనూ బ్యూటిఫికేషన్ పనులు పూర్తి చేశారు. విగ్రహాలను తరలించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు తుది దశకు చేరాయి. డిసెంబర్ మొదటి వారంలో మరోచోట విగ్రహాల ఆవిష్కరణ ఉంటుందని సమాచారం.


