News March 30, 2025
HYD: గచ్చిబౌలి, KPHBలో RAIDS

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. 12 మంది సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. AHTU DCP ఆధ్వర్యంలో కూకట్‌పల్లి, KPHB, గచ్చిబౌలి PS పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహిళలను పట్టుకున్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ ఇచ్చి బైండ్ ఓవర్ చేశారు. సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని పోలీసులు సూచించారు.
Similar News
News April 17, 2026
బాంబు కాదు: ఉప్పల్ మెట్రో స్టేషన్ చెత్త డబ్బాలో టపాసులు: పోలీసులు

ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబు బెదిరింపు వార్తలపై పోలీసులు స్పందించారు. చెత్త డబ్బాలో టపాసులు ఉన్నట్లు గమనించిన సిబ్బంది మెట్రో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై PSకు కాల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మెట్రో స్టేషన్‌ను తనిఖీ చేయగా, అవి వేడుకల్లో వాడే టపాకాయలని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.
News April 17, 2026
గంటలోపు ఆసుపత్రికి చేరిస్తే రూ.25వేల రివార్డు: మంత్రి

నాగోల్ డ్రైవింగ్ సెంటర్‌లో ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనదారులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రమాద బాధితులను గంటలోపు ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడితే రూ.25వేల నగదుతో ‘రహవీర్ అవార్డు’ ఇస్తామని ప్రకటించారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
News April 17, 2026
HYD: కాగితాల్లో 501.. నేల మీద 185..! (2)

చెరువుల బదిలీలో భారీ స్కామ్ జరిగిందా? GO 120 (2010) ప్రకారం 501 చెరువులను గుర్తించి, అందులో 399 మున్సిపల్ శాఖకు అప్పగించారు. కానీ పదేళ్లలోనే ఈ సంఖ్య 185కి ఎలా పడిపోయింది? హిమాయత్‌సాగర్ పరిధిలో 40 శాతం నీటి విస్తీర్ణం మాయమై, కాంక్రీట్ కోటలు వెలిశాయి. హుడా మాస్టర్ ప్లాన్ లెక్కలకూ, ఇప్పటి పరిస్థితికీ పొంతన లేదు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న <<19672164>>చెరువులు క్షేత్రస్థాయిలో<<>> కనిపించడం లేదు.


