News August 27, 2024
HYD: గణేశుడిని నిలబెట్టేవారికి ముఖ్య గమనిక
➤పోలీస్ పర్మిషన్ తప్పనిసరి
➤కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం
➤మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు
➤కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి
➤DJలకు అనుమతి లేదు
➤రాత్రి 10 దాటిన తర్వాత మైక్‌లు ఆఫ్ చేయాలి
➤సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు
ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT
Similar News
News September 17, 2024
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలన వేడుకలు
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.
News September 17, 2024
బాలాపూర్ లడ్డూ.. 30 ఏళ్లలో ఆమె ఒక్కరే..!
HYD బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ప్రతీ సంవత్సరం ఎంతో ఉత్కంఠ నడుమ కొనసాగుతుంది. అయితే ప్రతిసారి ఇందులో పురుషులే పాల్గొంటూ ఉంటారు. కానీ 2009లో మాత్రం సరిత అనే మహిళ వేలంలో పాల్గొని రూ.5,10,000కు లడ్డూ కైవసం చేసుకుని సత్తా చాటారు. 1994 నుంచి 2024 వరకు 30 ఏళ్లలో బాలాపూర్ లడ్డూ కొన్న ఒకే ఒక్క మహిళగా సరిత నిలిచారు. ఈసారి రూ.30,01,000కు కొలన్ శంకర్ రెడ్డి లడ్డూ దక్కించుకున్న విషయం తెలిసిందే.
News September 17, 2024
బస్ భవన్‌లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
హైదరాబాద్ బస్ భవన్‌లో మంగళవారం ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ ఘనంగా జరిగింది. TGSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) మునిశేఖర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ, హెచ్‌వోడీలు, తదితరులు పాల్గొన్నారు.