News August 21, 2024

HYD: గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు: సీపీ

image

గణేశ్ ఉత్సవాలు సజావుగా సాగేలా భారీ బందోబస్తు, నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. బుధవారం గణేశ్ ఉత్సవాల బందోబస్తుపై అధికారులతో రాచకొండ సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు మండపాల నిర్వాహకులు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలన్నారు. మండపాల్లో డీజేలకు అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు.
SHARE IT

Similar News

News February 6, 2025

ఓయూ: వివిధ డిగ్రీ కోర్సుల పరీక్ష ఫీజు ఖరారు

image

OU పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల అన్ని విభాగాల BA, B Com, BSc, BBA కోర్సుల నాలుగు, ఆరు రెగ్యులర్ సెమిస్టర్‌, మొదటి, ఆరో సెమిస్టర్ బ్యాక్‌లాగ్‌ పరీక్షా ఫీజులను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శశికాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 వరకు ఎలాంటి లేట్‌ఫీ రుసుము లేకుండా కాలేజీలో చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను www.osmania.ac.inలో సందర్శించాలన్నారు.

News February 6, 2025

పెద్దఅంబర్‌పేట్‌లో స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

image

పెద్దఅంబర్‌పేట్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల బాలిక మృతి చెందింది. స్థానికుల ప్రకారం.. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో రిత్విక LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పసిపాప బస్సు కింద పడి నలిగిపోయిందని వారు వాపోయారు.

News February 6, 2025

శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు.. క్లారిటీ

image

శంషాబాద్‌లో కూల్చివేతలపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. రాళ్ల‌గూడ విలేజ్ వ‌ద్ద ఓఆర్ఆర్ స‌ర్వీసు రోడ్డుకు వెళ్లే దారి లేకుండా 55 మీట‌ర్ల మేర ప్ర‌హ‌రీ నిర్మించారు. స‌ర్వీసు రోడ్డుకు వెళ్లే దారి లేకుండా చేశార‌ని రాళ్ల‌గూడ విలేజ్ ప‌రిస‌ర ప్రాంతాల లేఔట్‌ల నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేయ‌డంతో ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

error: Content is protected !!