News August 21, 2024
HYD: గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు: సీపీ
గణేశ్ ఉత్సవాలు సజావుగా సాగేలా భారీ బందోబస్తు, నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. బుధవారం గణేశ్ ఉత్సవాల బందోబస్తుపై అధికారులతో రాచకొండ సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు మండపాల నిర్వాహకులు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలన్నారు. మండపాల్లో డీజేలకు అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు.
SHARE IT
Similar News
News September 7, 2024
HYD: రాజ్‌భవన్‌లో వినాయక చవితి వేడుకలు
HYD సోమాజిగూడలోని రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గణేశుడికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఈ గణేశ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ విద్యార్థులు సాదా బంకమట్టితో పర్యావరణ అనుకూలంగా తయారు చేశారు. విషరహిత కూరగాయల రంగులతో పెయింట్ వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
News September 7, 2024
HYD: డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన టీపీసీసీ నూతన అధ్యక్షుడు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను HYD బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మార్యదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు వ్యవసాయ కమిషన్ నూతన ఛైర్మన్ కోదండ రెడ్డి డిప్యూటీ సీఎంను కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కార్పొరేషన్ ఛైర్మన్లు అనిల్ కుమార్, శివసేన రెడ్డి, అన్వేశ్ రెడ్డి ఉన్నారు.
News September 7, 2024
HYD: గాంధీ భవన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
వినాయక చవితి పర్వదినోత్సవం సందర్భంగా HYD గాంధీ భవన్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్ రావ్, ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, కార్పొరేషన్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్, మహేశ్, శ్రీనివాస్ రెడ్డి, నాయకుడు అల్లం భాస్కర్ పాల్గొన్నారు.