News May 12, 2024
HYD: గత ఎన్నికల్లో స్వతంత్రులకు 5,173 ఓట్లు

హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 2019 పార్లమెంట్ ఎన్నికలలో స్వతంత్రులకు 5,173 ఓట్లు వచ్చాయి. నోటాకు మాత్రం 5,653 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. ముందస్తు ఎత్తుగడలతో వివిధ పార్టీల నేతలు స్వతంత్రులను బరిలోకి దింపుతున్నారు. స్వతంత్రులు, నోటాకు వచ్చిన ఓట్లు గెలుపోటములపై కీలకంగా మారుతున్నాయి.
Similar News
News December 16, 2025
HYDలో KCR మీటింగ్ వాయిదా

ఈ నెల 19న జరగాల్సిన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాన్ని 21వ తేదీకి వాయిదా వేశారు. 19న పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు సమావేశంలో పాల్గొనేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ స్పష్టంచేశారు.
News December 16, 2025
IDPL ల్యాండ్స్ వివాదంపై సర్కారు విచారణకు ఆదేశం

IDPL ల్యాండ్స్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4000 కోట్ల రూపాయల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంచలనంగా మారిన ఈ వివాదంలో తాజాగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత పరస్పరం భూకబ్జా ఆరోపణలు చేసుకున్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనీ సర్వే నెంబర్ 376లో జరిగిన భూవివాదాలపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
News December 16, 2025
HYD: ‘చే’ చివరిపోరుకు ‘బొలీవియా డైరీ’ రూపం

‘బొలీవియా డైరీ’లో చేగువేరా చివరి రోజులు, గెరిల్లా పోరాటం, <<18569067>>విప్లవంపై<<>> ఆయన అచంచల నిబద్ధత.. హృదయాన్ని ఇందులోని అక్షరాలు కదిలిస్తాయి. ఆకలి, వ్యాధులు, ద్రోహం, అపజయాల మధ్య వెనకడుగు వేయని విప్లవ ఆత్మ ప్రతి పుటలో ఉప్పొంగుతుంది. విజయానికి మించిన సిద్ధాంత విశ్వాసమే చేగువేరా జీవన తత్వంగా బలమైన ముద్ర వేసింది. ఇది కేవలం పర్సనల్ డైరీ కాదు.. ప్రపంచ విప్లవ చరిత్రలో ఒక అమర పుట. ఇది యువతను ఆలోచింపజేసే రచన.


