News February 4, 2025
HYD: గన్ ప్రాక్టీస్.. కుక్కను చంపిన ప్రభాకర్!

HYD గచ్చిబౌలిలోని ప్రీజం పబ్‌లో పోలీసులపై కాల్పుల జరిపిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ గురించి సంచలన విషయాలు వెలుగుచూశాయి. రూ. 10 లక్షలు పెట్టి 3 గన్‌లు, 500 బుల్లెట్లు కొన్న ప్రభాకర్.. ప్రాక్టీస్‌లో భాగంగా ఓ కుక్కను చంపినట్లు తెలుస్తోంది. బిజినెస్ అంటూ బిల్డప్ ఇస్తూ HYDలో మకాం వేశాడు. తాజాగా కాల్పులు జరిపి దొరికిపోయాడు. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది.
Similar News
News February 18, 2025
HYD: శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డ విదేశీ కరెన్సీ

శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్‌ఎఫ్ అధికారులకు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతణ్ణి క్షుణ్ణంగా తనిఖీ చేయగా 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకుని సీజ్ చేసరు. ప్రయాణికుడిని అమీర్ అహ్మద్‌గా గుర్తించి అదుపులోకి తీసుకొని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
News February 18, 2025
BREAKING: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో తప్పిన ప్రమాదం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన బ్లూ డార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య ఏర్పడింది. దీంతో రన్ వేపై అత్యవసర ల్యాండింగ్‌కు పైలెట్ అనుమతి కోరారు. అనంతరం కార్గో ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు.
News February 18, 2025
HYD: నేటి నుండి TGCSB షీల్డ్ కాంక్లేవ్

నేటి నుంచి 2రోజుల పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో షీల్డ్ కాంక్లేవ్ 2025 జరగనుంది. సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించే ఆవిష్కరణలపై కాంక్లేవ్‌కు సీఎం రేవంత్, పోలీస్ ఉన్నత అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు 1,200 సైబర్ భద్రత నిపుణులు దరాఖాస్తులు చేసుకోగా 590 మందిని TGCSB సెలెక్ట్ చేసింది.