News February 4, 2025

HYD: గన్ ప్రాక్టీస్.. కుక్కను చంపిన ప్రభాకర్!

image

HYD గచ్చిబౌలిలోని ప్రీజం పబ్‌లో పోలీసులపై కాల్పుల జరిపిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ గురించి సంచలన విషయాలు వెలుగుచూశాయి. రూ. 10 లక్షలు పెట్టి 3 గన్‌లు, 500 బుల్లెట్లు కొన్న ప్రభాకర్.. ప్రాక్టీస్‌లో భాగంగా ఓ కుక్కను చంపినట్లు తెలుస్తోంది. బిజినెస్ అంటూ బిల్డప్ ఇస్తూ HYDలో మకాం వేశాడు. తాజాగా కాల్పులు జరిపి దొరికిపోయాడు. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది.

Similar News

News November 14, 2025

కొడంగల్: శారీరక దృఢత్వానికి కలరిపయట్టు దోహదం..!

image

కొడంగల్ పరిధి హస్నాబాద్‌లో మూడు రోజులుగా కలరిపయట్టు శిక్షణ కొనసాగుతోంది. ఇటివలే గ్రామానికి వచ్చిన సినీ నటుడు ప్రభాకర్ గ్రామ పంచాయతీ ఆవరణలో కొనసాగుతున్న శిక్షణలో శిక్షకులతో ముచ్చటించారు. కలరిపయట్టు విద్య నేర్చుకోవడంతో శారీరక దృఢత్వం, మానసిక ఏకాగ్రత లాంటి అంశాలపై దృష్టి సారించవచ్చన్నారు. కలరిపయట్టు అనేది కేరళలో ఉద్భవించిన ఒక పురాతన భారతీయ యుద్ధ కళ అని శిక్షకుడు రమేశ్ వివరించారు.

News November 14, 2025

పెరగనున్న ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు!

image

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజులు పెరిగే అవకాశం ఉంది. ఇవాళ లేదా రేపు కొత్త ఫీజులకు సంబంధించిన జీవో రానున్నట్లు తెలుస్తోంది. 2025-27 పీరియడ్‌కు సంబంధించి కొత్త ఫీజుల ప్రతిపాదలను టీఏఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి పంపగా ఇప్పటికే ఫైనల్ చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండటంతో జీవో నిలిచిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈసీ అనుమతితో విడుదల చేయనుంది.

News November 14, 2025

ఖమ్మం: మా పిల్లలు మంచిగా చదువుతున్నారా..?

image

ఖమ్మం జిల్లాలోని నేడు అన్ని పాఠశాలల్లో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 1,217ప్రభుత్వ పాఠశాలలు,14 కేజీబీవీలు, రెండు మోడల్ స్కూల్స్ ఉన్నాయి. సుమారు 66వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. సమావేశాలకు హజరయ్యే పేరెంట్స్‌కి స్కూల్లో బోధన, విద్యార్థుల పట్ల ఎలా మెలగాలి, వారిని ఎలా ప్రోత్సాహించాలనే అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అంశాల వారీగా 40నిమిషాల పాటు సమావేశం నిర్వహించనున్నారు.