News February 4, 2025

HYD: గన్ ప్రాక్టీస్.. కుక్కను చంపిన ప్రభాకర్!

image

HYD గచ్చిబౌలిలోని ప్రీజం పబ్‌లో పోలీసులపై కాల్పుల జరిపిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ గురించి సంచలన విషయాలు వెలుగుచూశాయి. రూ. 10 లక్షలు పెట్టి 3 గన్‌లు, 500 బుల్లెట్లు కొన్న ప్రభాకర్.. ప్రాక్టీస్‌లో భాగంగా ఓ కుక్కను చంపినట్లు తెలుస్తోంది. బిజినెస్ అంటూ బిల్డప్ ఇస్తూ HYDలో మకాం వేశాడు. తాజాగా కాల్పులు జరిపి దొరికిపోయాడు. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది.

Similar News

News January 19, 2026

VKB: ‘లక్కీ డ్రా పేరిట మోసాలపై అప్రమత్తంగా ఉండాలి’

image

లక్కీ డ్రా పేరిట జరుగుతున్న మోసాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ స్నేహ మేహ్రా జిల్లా ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌ కార్లు బైక్స్ ప్లాట్స్ డీజేలు ఇస్తామంటూ లక్కీ డ్రాలో పేరుతో మోసాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. అమాయకపు ప్రజల ఆశను ఆసరాగా చేసుకొని నిండా ముంచుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News January 19, 2026

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం

image

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 30న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజా పరిష్కార వేదికలో భాగంగా ఆమె ఉద్యోగ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. పదోన్నతులు, ఇతర సర్వీసు అంశాలపై అర్జీలు స్వీకరించనున్నట్లు వివరించారు. అర్హత కలిగిన ప్రతి అభ్యర్థనను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News January 19, 2026

పెద్దపల్లి: ‘అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి’

image

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు ప్రజల నుంచి దరఖాస్తులు, ఫిర్యాదులు స్వీకరించారు.