News July 9, 2024

HYD: గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ఇవే..!

image

✓గర్భాశయ క్యాన్సర్ వచ్చిన వారికి నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అవుతుంది.✓పొత్తి కడుపులో నొప్పి.. తరచూ కడుపు ఉబ్బరం✓పదే పదే మూత్ర విసర్జనకు వెళ్తారు.ఆ సమయంలో మంట, నొప్పిగా అనిపిస్తుంది✓శృంగారంలో పాల్గొన్నప్పుడు, ఆ తర్వాత యోని దగ్గర నొప్పి, మంటగా ఉంటుంది✓దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ అవుతుంది✓అలసట, నీరసం, బరువు తగ్గడం, రక్తహీనత కనిపిస్తాయి•పై లక్షణాలు ఉంటాయని HYD MNJ డా. నాగశ్రీ తెలిపారు.

Similar News

News November 22, 2025

HYD: నిద్రావస్థలో.. నిఘా నేత్రం!

image

‘మేము సైతం’ నినాదంతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల పర్యవేక్షణపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్‌ సీతాఎవెన్యూ కాలనీతోపాటు మీర్‌పేట్ MLR కాలనీలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానమైనా వాటి నిర్వహణకు పోలీసులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉగ్రవాదుల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల వ్యవస్థపై పోలీస్ బాస్‌లు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

News November 22, 2025

HYD: ఐబొమ్మ రవి కేసులో సీఐడీ రంగ ప్రవేశం

image

ఐబొమ్మ రవి కేసులో తెలంగాణ సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. గేమింగ్, బెట్టింగ్ యాప్‌లను రవి ప్రమోట్ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించాడు. నాలుగు బెట్టింగ్ యాప్‌లను రవి ప్రమోషన్ చేశాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర నుంచి సీఐడీ సేకరించింది. రవి ఆర్థిక లావాదేవీలపైనా వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులపై సీఐడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

News November 22, 2025

HYD: వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎంతో అవసరం: సీపీ

image

వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎంతో అవసరమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. శుక్రవారం ఆయన పోలీస్ సిబ్బంది కోసం నిర్వహిస్తున్న పాతబస్తీ పేట్ల బురుజు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం ఎంతో అవసరమన్నారు.