News April 4, 2025
HYD: గర్ల్స్ క్యాబ్ ఎక్కుతున్నారా.. జాగ్రత్త!

HYDలో క్యాబ్, ఆటోలో ప్రయాణించే యువతులు, మహిళలకు పోలీసులు కీలక సూచన చేశారు. ‘వాహనంలో ఒంటరిగా ప్రయాణం చేస్తే అప్రమత్తంగా ఉండండి. డ్రైవర్ రూట్ మార్చితే వెంటనే ‘Hawk Eye’ యాప్‌లో SOS బటన్ నొక్కండి. దీంతో సన్నిహితులు, పెట్రోలింగ్ పోలీస్, సమీపంలోని PSకు రైడ్ వివరాలు వెళ్తాయి. వెంటనే మిమ్మల్ని సేవ్ చేస్తారు’ అని తెలిపారు. ఇటీవల పహాడీషరీఫ్‌లో యువతిపై కారు డ్రైవర్ అఘాయిత్యం చేశాడు. బీ కేర్ ఫుల్ గర్ల్స్!
Similar News
News December 10, 2025
SRCL: ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ బందోబస్తు: SP

ఎన్నికల నిర్వహణకు సంబంధించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ మహేశ్ బి గితే తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా సమస్యలుంటే అధికారులు వెంటనే తెలియజేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో RDOలు వెంకటేశ్వర్లు, రాధా భాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, నోడల్ అధికారులు శేషాద్రి, లక్ష్మీరాజం పాల్గొన్నారు.
News December 10, 2025
ఖమ్మంలో తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల్లోని 172 సర్పంచ్, 1,415 వార్డు స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి 1గంట వరకు పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ విడతలో 2,41,137 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 2,089 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసి, 4,220 మంది సిబ్బందిని విధుల్లో నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
News December 10, 2025
సిరిసిల్ల: రేపే తొలి విడత ఎన్నికల పోలింగ్

జిల్లాలో తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐదు మండలాల్లో 85 సర్పంచ్, 758 వార్డు స్థానాలకు గాను 9 సర్పంచ్, 229 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 76 సర్పంచ్, 519 వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.


