News December 5, 2024
HYD: గాంధీ ఆస్పత్రికి రేవతి మృతదేహం తరలింపు
RTC X రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన <<14793966>>తొక్కిసలాటలో రేవతి<<>> చనిపోవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. దిల్‌సుఖ్‌నగర్ వాసి రేవతి(39), భర్త భాస్కర్, పిల్లలు శ్రీతేజ్(9), సన్వీక(7)తో కలిసి అభిమాన హీరో మూవీ పుష్ప-2 చూసేందుకు వెళ్లారు. అయితే తొక్కిసలాటలో రేవతి చనిపోగా బాలుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలవడంతో బేగంపేట కిమ్స్‌కు తరలించారు. రేవతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలో చూసి బంధువులు బోరున విలపించారు.
Similar News
News December 27, 2024
HYD: మంద జగన్నాథానికి మంత్రి పరామర్శ
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథాన్ని HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా నిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ బీరప్ప, వైద్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన చికిత్సను అందించాలని మంత్రి వైద్యులను కోరారు.
News December 27, 2024
HYD: వారం రోజులు సంతాప దినాలు: TPCC
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో వారం రోజులపాటు సంతాప దినాలుగా పాటించనున్నట్లు పేర్కొన్నారు. రేపటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలతో పాటు జనవరి 3 వరకు అన్ని రాజకీయ కార్యక్రమాలు రద్దు చేయనున్నట్లు తెలిపారు.
News December 27, 2024
HYD: స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం
ఎనిమిదో ఎడిషన్ తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఘనంగా ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు 6 విభాగాల్లో పోటీ పడుతున్నారు. తొలి రోజు ప్రతికూల వాతావరణంలోనూ హుస్సేన్‌సాగర్ జలాల్లో సెయిలర్లు రంగురంగుల బోట్లలో ప్రాక్టీస్‌తో సందడి చేశారు. ఈ ఏడాది హర్యానాకు చెందిన ఆరుగురు సెయిలర్లు ఓపెన్ విభాగంలో పాల్గొంటున్నారు.