News May 21, 2024
HYD: గాంధీ ఆస్పత్రిపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిపై సామాజిక మాధ్యమంలో తప్పుడు పోస్టు పెట్టిన ఓ వ్యక్తిపై చిలకలగూడ ఠాణాలో కేసు నమోదైంది. అధికారులు తెలిపిన వివరాలు.. గాంధీ ఆసుపత్రిలో కొద్ది గంటల పాటు కరెంట్ లేదని ఓ వీడియోను సోమవారం ట్విట్టర్లో పోస్టు చేశాడు. దీనిపై ఆరా తీసిన అధికారులు అది కొన్నేళ్ల కిందట తీసిన వీడియోగా గుర్తించారు. ఆసుపత్రి ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేయడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 23, 2025
GHMCకి ఇదే ఆఖరు.. ఏం జరుగుతుందో?

GHMC పాలక మండలి సమావేశం ఈ నెల 25న జరుగనుంది. పాలకమండలి గడువు త్వరలో ముగియనుండటంతో ఇదే చివరి సర్వసభ్య సమావేశం అని తెలుస్తోంది. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఏమేం అంశాలపై మాట్లాడాలో అజెండా తయారు చేసుకుంటున్నారు. ఈలలు, కేకల మధ్య సభ్యులందరితో ఫొటో సెషన్ కూడా ఉంటుంది. ఇప్పటికే సభ్యులందరికీ సమాచారం అందింది. మరి సమావేశం వాడి.. వేడిగా జరుగుతుందా.. లేక ఆహ్లాద వాతావరణం నెలకొంటుందా అనేది చూడాలి.
News November 23, 2025
HYD: బస్సెందుకు మామా.. బండిపై పోదాం!

సిటీ బస్ ఎందుకు మామా.. బైక్ ఉంది కదా దానిపై పోదాం అని అంటున్నారు పురుషులు. నగరంలో బస్ ఎక్కే పురుషుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఇందుకు ఈ గణాంకాలే సాక్ష్యం. సిటీలో రోజూ 2,850 బస్సుల్లో 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 18.5 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉండగా పురుషులు కేవలం 7.5 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కలు చాలు పురుషులు బస్లో వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుసుకోవడానికి.
News November 23, 2025
గుడ్ న్యూస్.. DEC 1 నుంచి PhD ఇంటర్వ్యూలు

JNTUలో PhD ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం వర్సిటీ గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే నెల 1 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు. 8వ తేదీ వరకు ఈ ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఒక్క ఆదివారం మినహాయిస్తే మిగతా రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, అభ్యర్థులు ఈ విషయం గమనించి హాజరుకావాలని సూచించారు.


