News June 21, 2024
HYD: గాంధీ ఆస్పత్రిలో MLA భార్య మృతదేహానికి ముగిసిన పోస్టుమార్టం
కాంగ్రెస్ నేత, చొప్పదండి MLA మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌లో ఈరోజు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా HYD జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు గాంధీ ఆసుపత్రిని సందర్శించి పోస్టుమార్టం నిర్వహించే మార్చురీ వద్ద డాక్టర్లతో మాట్లాడారు. నిన్న రాత్రి MLA భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.
Similar News
News September 17, 2024
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలన వేడుకలు
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.
News September 17, 2024
బాలాపూర్ లడ్డూ.. 30 ఏళ్లలో ఆమె ఒక్కరే..!
HYD బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ప్రతీ సంవత్సరం ఎంతో ఉత్కంఠ నడుమ కొనసాగుతుంది. అయితే ప్రతిసారి ఇందులో పురుషులే పాల్గొంటూ ఉంటారు. కానీ 2009లో మాత్రం సరిత అనే మహిళ వేలంలో పాల్గొని రూ.5,10,000కు లడ్డూ కైవసం చేసుకుని సత్తా చాటారు. 1994 నుంచి 2024 వరకు 30 ఏళ్లలో బాలాపూర్ లడ్డూ కొన్న ఒకే ఒక్క మహిళగా సరిత నిలిచారు. ఈసారి రూ.30,01,000కు కొలన్ శంకర్ రెడ్డి లడ్డూ దక్కించుకున్న విషయం తెలిసిందే.
News September 17, 2024
బస్ భవన్‌లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
హైదరాబాద్ బస్ భవన్‌లో మంగళవారం ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ ఘనంగా జరిగింది. TGSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) మునిశేఖర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ, హెచ్‌వోడీలు, తదితరులు పాల్గొన్నారు.