News August 23, 2024

HYD: గాంధీ, ఈఎస్ఐసీని ప్రశంసించిన ఐసీఎంఆర్

image

కరోనా కష్టకాలంలో రోగులకు సేవలందించిన గాంధీ మెడికల్ కాలేజీ, సనత్ నగర్ ఈఎస్ఐసీ ఆస్పత్రులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రశంసలతో ముంచెత్తింది. గురువారం ఢిల్లీ క్లినికల్ రిజిస్ట్రీ ఫర్ కొవిడ్-19 రిపోర్టు రిలీజ్ అండ్ డిస్సెమినేషన్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధీ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు, ప్రొఫెసర్ త్రిలోక్ చందర్‌ను సన్మానించి, ప్రశంసాపత్రాలను అందజేశారు.

Similar News

News January 24, 2026

ఇకపై హైరైజ్ బిల్డింగులకు TDR మస్ట్!

image

సిటీలో 10 అంతస్తులపైన కట్టే బిల్డింగులకు ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. 10వ అంతస్తు పైన నిర్మించే ఏరియాలో 10% ఖచ్చితంగా TDR ద్వారానే నింపుకోవాలి. అంటే బిల్డర్లు TDR సర్టిఫికెట్లను కొనుగోలు చేయడం తప్పనిసరి. దీనివల్ల టీడీఆర్ కార్డులు ఉన్నవారికి ఫుల్ డిమాండ్ పెరుగుతుంది. ఈ సర్టిఫికెట్లను ఇప్పుడు HMDA పరిధిలో ఎక్కడైనా వాడుకోవచ్చు. చెరువుల బఫర్ జోన్ స్థలాలకు ఇప్పుడు ఏకంగా 300% TDR ఇస్తున్నారు.

News January 24, 2026

HYD: స్థలాలు ఇచ్చే వారికి సర్కార్ బంపర్ ఆఫర్!

image

రోడ్ల విస్తరణలో లేదా చెరువుల శిఖం భూముల్లో ఆస్తులు కోల్పోయేవారికి సర్కార్ అదిరిపోయే ఛాన్స్ ఇస్తోంది. ఆస్తికి బదులుగా నగదు కాకుండా TDR సర్టిఫికెట్లు ఇస్తారు. వీటితో పర్మిషన్ లేకపోయినా అదనంగా రెండు అంతస్తులు వేసుకోవచ్చు. రోడ్డు విస్తరణకు 400%, చెరువుల FTL భూములకు 200% టీడీఆర్ లభిస్తుంది. ఆధార్‌తో లింక్ అవ్వడం వల్ల మీ టీడీఆర్ ఎవరూ కొట్టేయలేరు, అంతా ఆన్‌లైన్ బ్యాంక్ ద్వారా పారదర్శకంగా జరుగుతుంది.

News January 24, 2026

BIG BREAKING: నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్.. ఇటు వెళ్లకండి!

image

నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని సందర్శకులు తమ ఎగ్జిబిషన్ పర్యటనను ఈ రోజు వాయిదా వేసుకోవాలని CP సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఇప్పటికే అబిడ్స్-నాంపల్లి మార్గంలో వాహనాల కదలిక మందగించింది. అబిడ్స్ నుంచి ఎంజే మార్కెట్ మార్గంలో వాహనాలను మళ్లించినా.. పరిస్థితి అదుపులోకి తేవడం కష్టతరమవుతోంది.