News February 19, 2025

HYD: గుండెపోటుతో మరో లాయర్ మృతి..!

image

HYDలో నేడు మరో లాయర్ గుండెపోటుతో మృతి చెందారు. తార్నాకకు చెందిన లాయర్ వెంకటరమణ మారేడ్‌పల్లిలోని ఇండియన్ బ్యాంక్‌లో చలానా కట్టేందుకు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలారని స్థానికులు తెలిపారు. హుటాహటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిన్న హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే లాయర్ వేణుగోపాల్ రావు మరణించిన సంగతి తెలిసిందే. వరుస గుండెపోటు మరణాలు HYDలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.

Similar News

News March 28, 2025

NZB: కల్లులో గడ్డి మందు కలుపుకొని సూసైడ్

image

నిజామాబాద్‌లో ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వివేకానంద కాలనీకి చెందిన కొత్త రాములు(58) గుమస్తాగా పని చేస్తున్నాడు. సదరు వ్యక్తికి అనారోగ్య సమస్యల కారణంగా ఈనెల 24వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కల్లులో గడ్డి మందు కలిపి తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా గురువారం మృతి చెందాడు.

News March 28, 2025

జనగామ: ప్రజలకు ప్రభుత్వం 90శాతం రాయితీ: కలెక్టర్

image

ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని పట్టణ, స్థానిక సంస్థలకు (ULB) ఆస్తి పన్నుపై 90% బకాయి వడ్డీని మాఫీ చేసే వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) పథకాన్ని విస్తరించిన నేపథ్యంలో.. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. వన్‌టైమ్‌ సెటిల్మెంట్ కింద ఆస్తి పన్ను చెల్లించే వారికి పన్ను వడ్డీ బకాయిలపై ప్రభుత్వం 90శాతం రాయితీ వస్తుందన్నారు.

News March 28, 2025

జిన్నారం: ట్రాక్టర్ చక్రం కిందపడి బాలుడి మృతి

image

ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతిచెందిన ఘటన బొల్లారం PS పరిధిలో గురువారం చోటుచేసుకుంది. జిన్నారం మం. మాదారంలో ట్రాక్టర్ డ్రైవర్ గంగారం.. సందీప్(12)ను ట్రాక్టర్ ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో బాలుడు జారి కింద పడగా ట్రాక్టర్ వెనకాల చక్రం బాలుడిపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే బాలుడు మృతిచెందినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. గంగారంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!