News April 5, 2025

HYD: గుండె, గ్యాస్ట్రో, న్యూరో ఆసుపత్రులుగా TIMS

image

HYDలో నిర్మాణం సాగుతున్న సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ TIMS ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. సనత్‌నగర్ కార్డియాక్ స్పెషాలిటీ, అల్వాల్ గ్యాస్ట్రో, ఎల్బీనగర్ న్యూరో స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చనున్నారు. HYDలో గాంధీ, ఉస్మానియా జనరల్ ఆసుపత్రులుగా ఉండగా, గుండె, గ్యాస్ట్రో, న్యూరో స్పెషాలిటీ వైద్యం అందుబాటులో లేకపోగా ఈ TIMSలను మార్చనున్నారు.

Similar News

News April 13, 2025

శాంతి భద్రతలను పర్యవేక్షించిన ADB SP

image

ఆదిలాబాద్‌లో భారీ ఎత్తున జరిగిన హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం జరిగిన శోభాయాత్రలో బందోబస్తు ప్రక్రియను డ్రోన్ ద్వారా, మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనంలో సీసీ కెమెరాల ద్వారా ఎస్పీ పరిశీలించారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా 300 పోలీసు సిబ్బందితో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News April 13, 2025

అభిషేక్.. రప్పా.. రప్పా!

image

IPL: 246 పరుగుల భారీ లక్ష్యఛేదనలో SRH దుమ్మురేపుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. 6 సిక్సర్లు, 11 ఫోర్లతో పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశారు. మరో ఓపెనర్ హెడ్ (37 బంతుల్లో 66) మెరుపులు మెరిపించి ఔటయ్యారు. SRH విజయానికి మరో 42 బంతుల్లో 71 పరుగులు అవసరం.

News April 13, 2025

తిరుమల: PIC OF THE DAY 

image

ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి శ్రీవారి ఆనంద నిలయం చంద్రుని కాంతిలో మెరిసిపోయింది. పౌర్ణమి చంద్రుడు ఆలయ శిఖరంపై తన ప్రకాశాన్ని విరజిమ్ముతూ భక్తులను మంత్ర ముగ్ధులను చేశాడు. ‘ఓ చంద్రమా, నా ఆనంద నిలయం నుంచి ప్రపంచానికి చల్లటి నీడను ఇవ్వు’ అన్న భావనను నిజం చేస్తూ తిరుగిరులపై చంద్రుని చల్లని వెలుగు పరచుకుంది. 

error: Content is protected !!